Shuru
Apke Nagar Ki App…
ఏకలవ్య గ్రామీణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్కేపలి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో సర్పంచ్ చేల్క స్వరూప వెంకటేష్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఏకలవ్య గ్రామీణ ఫౌండేషన్ మరియు పుష్పగిరి కంటి ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి వైద్య సలహాలు అందించారు.ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
E Basaiah Goud
ఏకలవ్య గ్రామీణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్కేపలి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో సర్పంచ్ చేల్క స్వరూప వెంకటేష్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఏకలవ్య గ్రామీణ ఫౌండేషన్ మరియు పుష్పగిరి కంటి ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి వైద్య సలహాలు అందించారు.ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
More news from Vikarabad and nearby areas
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తి పారవర్షంలో మునిగిన భక్తులు గణేష్ మండపాలలో వినాయకులను ప్రతిష్టించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 34 కాలనీలలో వినాయక మండపాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకులను ప్రతిష్టించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలనీలన్నీ వినాయకుని నామస్మరణతో మారి మోగిపోయాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.1
- మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1