Shuru
Apke Nagar Ki App…
వరంగల్‌లో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్: సిపి సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ఆట కట్టించారు. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.నిందితులు వరంగల్ నగరంలోని సుబేదారి, కేయూ, హన్మకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చెయిన్ స్నాచింగ్‌లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 95 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
M D Azizuddin
వరంగల్‌లో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్: సిపి సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ఆట కట్టించారు. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.నిందితులు వరంగల్ నగరంలోని సుబేదారి, కేయూ, హన్మకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చెయిన్ స్నాచింగ్‌లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 95 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్‌లోని కారుణ్య క్లీనిక్ సమీపంలో గొలుసు దొంగతనం జరిగింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళపై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.3
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- జగిత్యాల జిల్లాలో అకాల వర్షం వడగళ్ల వానతో పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. సారంగాపూర్ మండలం అర్పపల్లి , పెంబట్ల గ్రామంలో అకాల వర్షంతో నెలకొరిగిన మొక్కజొన్న, నువ్వుల పంటలను లక్ష్మీదేవిపల్లెలో రవి నాయక్ బీరకాయ తోటను రైతులతో కలిసి పరిశీలించారు. అక్కడినుంచే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలో అకాల వర్షంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. జన్మదిన కానుకగా రైతులు ఎవరు అధైర్యాపడొద్దు అని ప్రకటన చేసి కలెక్టర్ తో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వ పరంగా త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకం అమలు చేస్తే కొంత రైతుకు ఊరట కలుగుతుండేనని ప్రభుత్వం వెంటనే పంటల బీమా పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకున్నప్పుడే రైతాంగం పై ఆధారపడి ఉన్న రైతు కూలీలకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతామని తెలిపారు. పంటల పెట్టుబడి రైతు భరోసా రైతుకు కల్పింపచేయటంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.4
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- వరంగల్ జిల్లా:వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్న ‘ఉమానాగ్ పాలిమర్స్’పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్ సరుకును స్వాధీనం చేసుకొని, ఫ్యాక్టరీ నిర్వాహకుడికి రూ.50 వేల జరిమానా విధించారు. అధికారులు యూనిట్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.1