Shuru
Apke Nagar Ki App…
hajigamilcom పని, పొలీస్, రిపోర్ట్
Hajigamilcom Baba
hajigamilcom పని, పొలీస్, రిపోర్ట్
More news from తెలంగాణ and nearby areas
- Post by Merugu Rajitha1
- ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.2
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.3
- Post by Merugu Rajitha1