*పేద ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు* జఫర్ గడ్ మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జఫర్ గడ్ మండలం మరియు ఐనవోలు మండలం వెంకటాపూర్, గర్నేపల్లి గ్రామాలకు సంబందించిన 42మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 42లక్షల 04వేల 872రూపాయల చెక్కులను అలాగే 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 13లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్కువ నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని తెలిపారు. నియోజకవర్గంలో నెలకు సుమారు 150కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 50 కుటుంబాలకు ఎల్ఓసిల ద్వారా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడే పేద ప్రజలకు ఎల్ఓసిల ద్వారా, వైద్యం చేయించుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్ నీనో ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులలో కరువు ఏర్పడిందని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాత్రం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కరువు ప్రభావం కనిపించకుండా రిజర్వాయర్ల నుండి కాలువల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే వర్షాకాలం నాటికి 6L, 7L కాలువలు పూర్తి చేసి జఫర్ గడ్ కు గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ ఆధ్యర్యంలో అభినందన సభ శ్రీ బేతి వీరారెడ్డి గారికి తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన వేదిక: పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న 3໖: 20-09-2026 ఆదివారం సమయం: ৯ :6:00 e గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో అందరు ఆహ్వానితులే... ACCవర్కింగ్ కమిటీ జి. కృష్ట (జ.వై.గిరి ఫౌండేషన్) పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక) అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ లగిశెట్టి సభాకర్ చిలుమోజు సాయికిరణ్ గడం మనోజ్ కుమార్ గౌ3
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1