జీడబ్ల్యూఎంసీ సాధారణ నిధులతో హైమాస్ట్ దీపాల ఏర్పాటు: భూమిపూజ చేసిన మాజీ ఎంపీటీసీ జలగం రంజిత్ కుమార్ వరంగల్, ఆగస్టు 25: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సాధారణ నిధుల నుంచి మంజూరైన హైమాస్ట్ లైట్ టవర్ల నిర్మాణ పనులకు నాయకులు జలగం రంజిత్ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ఘనంగా భూమిపూజ చేశారు. ప్రజల సౌకర్యార్థం, రాత్రి వేళల్లో వెలుగులు నింపేందుకు పలు ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వద్ద ఈ హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు: అల్లిపురం పోచమ్మ నాగమయ్య దేవాలయ ప్రాంగణం తిమ్మాపురం నూతనంగా నిర్మించిన చర్చి (అమ్మవారిపేటకు వెళ్లే జంక్షన్‌లో) తిమ్మాపురం శ్మశానవాటిక గుంటూరుపల్లి జంక్షన్ లక్ష్మీపురం శ్మశానవాటిక ఈ సందర్భంగా జలగం రంజిత్ మాట్లాడుతూ.. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్, జన్మ భరత్, బాబు, మాచర్ల రంజిత్, ప్రసాద్ రావు, ఇన్నారెడ్డి, చాగంటి వెంకన్న, వీరేందర్, వేలానంద్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ సాధారణ నిధులతో హైమాస్ట్ దీపాల ఏర్పాటు: భూమిపూజ చేసిన మాజీ ఎంపీటీసీ జలగం రంజిత్ కుమార్ వరంగల్, ఆగస్టు 25: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సాధారణ నిధుల నుంచి మంజూరైన హైమాస్ట్ లైట్ టవర్ల నిర్మాణ పనులకు నాయకులు జలగం రంజిత్ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ఘనంగా భూమిపూజ చేశారు. ప్రజల సౌకర్యార్థం, రాత్రి వేళల్లో వెలుగులు నింపేందుకు పలు ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వద్ద ఈ హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. హైమాస్ట్
లైట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు: అల్లిపురం పోచమ్మ నాగమయ్య దేవాలయ ప్రాంగణం తిమ్మాపురం నూతనంగా నిర్మించిన చర్చి (అమ్మవారిపేటకు వెళ్లే జంక్షన్‌లో) తిమ్మాపురం శ్మశానవాటిక గుంటూరుపల్లి జంక్షన్ లక్ష్మీపురం శ్మశానవాటిక ఈ సందర్భంగా జలగం రంజిత్ మాట్లాడుతూ.. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్, జన్మ భరత్, బాబు, మాచర్ల రంజిత్, ప్రసాద్ రావు, ఇన్నారెడ్డి, చాగంటి వెంకన్న, వీరేందర్, వేలానంద్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.1