జీవో 97తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిన తుగ్లక్ రేవంత్ రెడ్డి -బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ జీవో 97తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిన తుగ్లక్ రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. సోమవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయని బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. స్కిల్ యూనివర్సిటీ చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దాని పరిధిలోకి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బిఆర్ఎస్వీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు వారి పక్షాన పోరాడుతామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో 97పై పునరాలోచించి, పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

- స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.1
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.1
- జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1