logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*అనవసరంగా విపక్షాలతో కలిశాం* * కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని నిన్నటిదాకా విమర్శలు చేశాం * చైర్మన్‌ ఎన్నికల్లో వారికే మద్దతిస్తే ఎలా * ఈ పరిణామంతో ఇబ్బందికర పరిస్థితి * తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత చర్చ మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా బీజేపీలో జరిగిన ఘటనలు అంతర్గత చర్చకు దారితీశాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌, నారాయణపేట మునిసిపాలిటీలో అనుసరించిన వైఖరిలాగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు మద్దతు ఇవ్వకుండా ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవన్న వాదన తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అంటూ నిన్నటిదాకా విమర్శనాస్త్రాలు సంధించిన తమకు, తాజా ఘటనలతో ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని కొంత మంది పార్టీ సీనియర్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే మరో అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ''ఏ పార్టీకి మనం వ్యతిరేకమో అదే పార్టీకి మద్దతివ్వడం సరికాదు.'' అని దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడొకరు స్పష్టం చేశారు. ''కొన్ని మునిసిపాలిటీల్లో పార్టీ స్థానిక నేతలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడంతో ఆయా కేంద్రాల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లకు బీజేపీ జీవం పోసినట్లయింది.'' అని పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ''కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కోసం కమలదళం ప్రయత్నం చేస్తోంది. . దేశమంతా ఒకలా ఉంటే, రాష్ట్రంలో మరోలా కొనసాగింది. ఈ పరిణామం ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. మరోవైపు, బీఆర్‌ఎస్ కు మద్దతు ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఎన్నడూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముఖ్యనాయకులు కాంగ్రేస్ కు మద్దతిస్తే, మరికొందరు బీఆర్‌ఎస్ కు అండగా నిలిచారు. ఇది సమర్థనీయం కాదు'' అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు. '' కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ లకు సమాన దూరంలో ఉండాలి. ఇది పార్టీ జాతీయ నాయకత్వం సందేశం. ఇందుకు భిన్నంగా పలు చోట్ల స్థానిక పార్టీ నాయకులు వ్యవహరించడం విడ్డూరం. నారాయణపేట మునిసిపాలిటీ, కరీంనగర్‌ కార్పొరేషన్‌ మాత్రమే ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా గెలిచాం. కొన్ని మునిసిపాలిటీల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి వైస్‌ ఛైర్మన్‌ పదవులు తీసుకోవడం సమర్థనీయం కాదు'' అని ఆయన పేర్కొన్నారు. '' జగిత్యాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే కచ్చితంగా ఛైర్మన్‌ పదవి మాకు దక్కేది. కానీ, బీఆర్‌ఎస్‌ మాజీ నేత ఒకరు సూచించిన అభ్యర్థులకు పలు చోట్ల టికెట్లు ఇచ్చారు. అందుకే చేదు ఫలితం దక్కింది'' అని పలువురు జగిత్యాల జిల్లా నేతలు రాష్ట్ర పార్టీకి నివేదించారు. కాగా, మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఎంపీలు, మరో ఎమ్మెల్యే అనుసరించిన వైఖరిపై స్థానిక పార్టీ కార్యకర్తలు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ ఫిర్యాదుకు అనుగుణంగా జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి....

14 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago
a1588f0d-fd94-4b24-9fa9-49265ce0239b

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.
    1
    RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC
గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
    1
    గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.
    1
    విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.
    1
    తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం
*ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,*
బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
    1
    మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే
    1
    ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి  ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే
    user_Chandrasekhar Tdp
    Chandrasekhar Tdp
    Construction equipment supplier బొల్లాపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    1
    నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.
    1
    గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.