ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్సెస్ కోర్సులకు వర్తింపు విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపు • వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ఏర్పాటు *• ఈ-రీసోర్స్ ద్వారా 24 గంటలపాటు విద్యార్థులకు పరిశోధన సమాచారం* *• పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపై తెచ్చేందుకు కృషి* *• వైద్య విద్యలో ప్రమాణాల పెంపు, వినూత్న కార్యక్రమాలకు మరిన్ని నిధులు* *- ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నామని దీనివల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతోపాటు విద్యాపరంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడతాయని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ వెల్లడించారు. స్థానిక విశ్వవిద్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ ని డిజిటల్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య విద్యలో ప్రమాణాల పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వైద్య విద్య ప్రమాణాల పెంపుతోపాటు వ్యాధుల నిరోధ చర్యల్లో విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందన్నారు. ఇందులో భాగంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ అధ్యక్షతన మార్చి 17 న విశ్వవిద్యాలయంలో 244 వ పాలకవర్గ సమావేశం జరిగిందన్నారు. కేవలం అల్లోపతి వైద్యంలో మాత్రమే కాకుండా ఆయుష్ డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎలైడ్ సైన్సెస్ (పారా మెడికల్), ఇతర వైద్య కోర్సుల్లో చదివే విద్యార్థులు, బోధకులు (ఫ్యాకల్టీ) పరిశోధనలవైపు దృష్టిపెట్టేలా, క్రీడలను ప్రోత్సహించేలా, పూర్వ వైద్య విద్యార్థుల సహకారాన్ని పొందేందుకు వీలుగా నిర్ణయాలు జరిగాయన్నారు. వీటిని కార్యాచరణలోనికి తెచ్చేందుకు ఏటా రూ. 22.13 కోట్ల వరకు వ్యయమవుతుందన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలు మూడేళ్లపాలు కొనసాగుతాయని, తదుపరి మరోమారు పునఃపరిశీలన చేసి, నాటి అవసరాలకు తగ్గట్లు చర్యలు తీసుకుంటారు అని ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. అమరావతి పరిధిలో విశ్వవిద్యాలయం కోసం దాదాపు 25 ఎకరాల స్థలం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని సీఆర్డీఏ చురుగ్గా పరిశీలిoచిందన్నారు. వైదిక కళాశాలల్లో జరిగే పరీక్షలు తీరును విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వెబ్ కెమెరాల సహాయంతో ఖచ్చితంగా పరిశీలిస్తున్నామన్నారు. *1,000 మంది పరిశోధన విద్యార్థులకు రూ. 30 వేల చొప్పున ఉపకార వేతనం!* పరిశోధనలపట్ల విద్యార్థులు మొగ్గుచూపేలా ప్రతి ఏటా కనీసం 1,000 మందికి ఉపకార వేతనం కింద ఆరునెలలపాటు రూ.5 వేల చొప్పున రూ. 30 వేలు ఇస్తామన్నారు. ప్రస్తుత విధానంలో ప్రతి ఏడాది యూజీ మెడికల్ విద్యార్థులకు మాత్రమే పరిశోధనల నిమిత్తం నెలకు ఐదువేల చొప్పున 500 మందికి రెండునెలలకు కలిపి రూ. 10 వేలు మాత్రమే ఇస్తున్నామని, కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పరిశోధన వ్యవధి కాలాన్ని ఆరునెలలకు పొడిగించాం. విద్యార్థుల సంఖ్యను కూడా పెంచాం. మూడేళ్లకు కలిపి 3వేల మంది విద్యార్థులు స్వల్పకాలిక పరిశోధనలు చేస్తారు అల్లోపతితోపాటు ఆయుష్ పారామెడికల్, ఇతర కోర్సుల్లో చదివే వారిని కూడా ప్రోత్సహిస్తాం. *ఫ్యాకల్టీనీ ప్రోత్సహించేందుకు రీసెర్చి గ్రాంటు* ప్రస్తుతం అల్లోపతి, డెంటల్ ఫ్యాకల్టీలో ఎవరైనా పరిశోధనలు చేస్తే ప్రస్తుతం 25 మందికి మాత్రమే రూ.2 లక్షల (ఒక్కొక్కరికి) చొప్పున రూ. 50 లక్షల వరకు ప్రతి ఏడాది (రీసెర్చి గ్రాంటు) విశ్వవిద్యాలయం ఇస్తుందన్నారు. అల్లోపతి, డెంటల్ విద్యలో మాత్రమే కాకుండా ఆయుర్వేద, యూనాని, నేచురోపతి, హోమియోపతి (ఆయుష్) బోధకులకు కూడా రీసెర్చి గ్రాంటు సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో పరిశోధకుల సంఖ్య 25 నుంచి ఏకంగా 200 కు పెరిగిందని, ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య పరిశోధన పత్రం ప్రాధాన్యత అనుసరించి ఇస్తామన్నారు. *పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లకు వారధిగా విశ్వవిద్యాలయం!* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఎక్కడెక్కడో ఉన్న పూర్వ వైద్య విద్యార్థుల వివరాలు సేకరించి, వారితో సంప్రదింపులు జరిపి, సమావేశాలు నిర్వహించి, కళాశాలల అభివృద్ధికి సహకరించేలా ప్రోత్సహించేందుకు రూ 10 లక్షల చొప్పున మూడేళ్లపాటు ప్రతి కళాశాలకు విశ్వవిద్యాలయం ఇస్తుంది. ప్రస్తుతం కళాశాలల వారీగా రకరకాల స్పెషాల్టీలు, అందరూ కలిసి పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లు నడుపుతున్నారు. కళాశాలల వారీగానే కాకుండా అన్ని అసోసియేషన్లను ఒక తాటిపైకి తీసుకొస్తారు, తద్వారా కళాశాలల వారీగా, స్పెషాల్టీల వారీగా సలహాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడేందుకు వీలుగా విశ్వవిద్యాలయం వారధిగా ఉంటుందన్నారు. *క్రీడల నిర్వహణకు ఏటా రూ. 10 లక్షలు* ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్రీడల నిర్వహణ, మైదానాల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రతి ఏటా ఇస్తారని వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ తెలిపారు. వైద్య విద్యార్థులకు బోధనతోపాటు మానసికోల్లాసాన్ని కలిగించేలా క్రీడలు, ఇతర పోటీల నిర్వహణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. దీనివల్ల ప్రతి ఏడాది రూ.170 కోట్ల వరకు వ్యయమవుతుంది. ప్రస్తుతం చీడల పోటీలు, ఆటలకు ఉన్న ప్రాధాన్యం పెరగాల్సి ఉంది నిధులు ఇవ్వడం ద్వారా క్రీడలవైపు విద్యార్థులను దృష్టిపెట్టేందుకు వీలవుతుందన్నారు. *వర్శిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్* రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను సాంకేతికత ఆధారంగా మరింత బలోపేతం చేసేందుకు ఏఐ ఆధారిత డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ (డీఎండీసీ) ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పడబోతుందని వర్శిటీ రీసెర్చి అండ్ డెవలప్మెంటు డైరెక్టర్ డాక్టర్ ఎం. లక్ష్మీ సూర్యప్రభ తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాతక భాగస్వామ్యం, ఏఐ సాయంతో రాష్ట్రంలో వ్యాధుల ముందస్తు అంచనా, నివారణ, తక్షణ చర్యలు తీసుకునేలా ఈ కేంద్రం పనిచేయబోతుంది, తొలి ఏడాది ఇందుకు రూ.5.73 కోట్ల వరకు వ్యయమవుతుందన్నారు. ఆ తరువాత నుంచి రూ.3.7 కోట్ల వరకు ప్రతి ఏడాది ఖర్చు అవుతుంది సింగపూర్లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అనుబంధంగా ఉన్న పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు (సా స్వీ హక్ స్కూలు ఆఫ్ పబ్లిక్ హెల్త్) తో విశ్వ విద్యాలయం ఒప్పందం చేసుకోబోతుందన్నారు. దీనివల్ల డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ద్వారా ఎటువంటి కార్యకలపాలు నిర్వహించాలి, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, వైద్య ఆరోగ్య శాఖ అవసరాలు ఏమిటి, ఎటువంటి చర్యలు తీసుకుంటే భవిషత్తులో వ్యాధులు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది, అన్న వాటిపై సింగపూర్ వైద్య సంస్థ సలహాలు, సూచనలు ఇస్తుంది దీనిపై అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.1
- ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.2
- జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA1
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.1
- ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల పంపిణీ ఘనంగా 🔴 సోగనూరు రోడ్‌లో 1008 ఇళ్లను లబ్ధిదారులకు అందజేత 🔴 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు 🔴 పేదల సొంతింటి కలలు నిజం అవుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్య 🔴 త్వరలో కమ్యూనిటీ కాంప్లెక్స్, మార్కెట్, పార్కులు ఏర్పాటు 🔴 గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు 🔴 “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమం శివన్న నగర్‌లో నిర్వహణ 🔴 650 మందికి రూ.2.50 లక్షల సబ్సిడీ పత్రాల పంపిణీ 🔴 గృహ నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల ప్రారంభం 🔴 లబ్ధిదారులకు సాంప్రదాయ వస్త్రాల అందజేత 🔴 అధికారులు, స్థానిక నాయకులు భారీగా హాజరు1