బాసర త్రిబుల్ ఐటీ ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇటీవలే త్రిబుల్ ఐటీ లో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన బాసర త్రిబుల్ ఐటీ కి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయంలో ఆరా తీశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఏదైనా సమస్యలుంటే తనకు నేరుగా కాల్ చేయాల్సిందిగా సూచించారు. ఏదైనా కష్టం వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యను తోటి మిత్రులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధించగలుగుతామని, మనిషికి ఆస్తులు, అంతస్తుల కంటే విద్యనే ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అనంతరం వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ తో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఈ సందర్భంగా త్రిబుల్ ఐటీ అధ్యాపకులు ఎమ్మెల్యేకు కొన్ని సమస్యలను తెలియజేశారు. సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం విద్య పైనే ప్రధాన దృష్టి సారిస్తానని అందులో భాగంగానే పలుమార్లు త్రిబుల్ ఐటీ ని సందర్శించడం జరిగిందని, సమస్యలపై మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానన్నారు.

- గోదావరి హారతి బాసర1
- బాసర లో యోగి కి అక్షరాభ్యాసం1
- బాసర ట్రిపుల్ ఐటిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్1
- బాసర ఆర్జీయూకేటీలో ఎస్పీతో వాక్ థాన్ | Prime9 Adilabad1
- అమాలి లారీ మందు బాసర సిరికొండ అడుగు మందు1
- కార్తీకమాస వేడుకలు. బాసర 20241
- బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకోనున్న ఎస్పీ..1
- బాసర లో సరస్వతీ దేవీ అమ్మవారు.. | Saraswathi Devi Alankaram 2024 | Jayashankar Bhupalapalli | 24/71