Shuru
Apke Nagar Ki App…
పెడన చెక్‌పోస్ట్‌పై అనంతలక్ష్మి తనిఖీ రామరాజుపాలెం చెక్ పోస్టును పెడన మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ భీముని అనంతలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవాణా తనిఖీలు, రికార్డులు, సిబ్బంది హాజరు, ప్రజా సౌకర్యాలను సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని తెలిపారు.
Arja Durga Prasad
పెడన చెక్‌పోస్ట్‌పై అనంతలక్ష్మి తనిఖీ రామరాజుపాలెం చెక్ పోస్టును పెడన మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ భీముని అనంతలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవాణా తనిఖీలు, రికార్డులు, సిబ్బంది హాజరు, ప్రజా సౌకర్యాలను సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- *గుంటూరు జిల్లా పోలీస్...* *గుంటూరు ట్రాఫిక్ విభాగం* _*//గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించేందుకు బైకుపై క్షేత్రస్థాయిలో పర్యటించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రదేశాలను, ట్రాఫిక్ డైవర్షన్లను పరిశీలించేందుకు గౌరవ జిల్లా ఎస్పీ గారు ఈ రోజు సాయంత్రం గుంటూరు నగరం మొత్తం ద్విచక్ర వాహనంపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించారు. 📍 శంకర్ విలాస్ నిర్మాణం నేపథ్యంలో గుంటూరు నగరంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గౌరవ ఎస్పీ గారికి అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. 📍కంకర గుంట అండర్ పాస్ - గుజ్జనగుండ్ల సెంటర్ - కోరిటపాడు రోడ్డు - NTR స్టేడియం సర్కిల్ - లక్ష్మీ పురం మెయిన్ రోడ్ - మదర్ థెరిస్సా స్టాట్యూ సెంటర్ - లాడ్జ్ సెంటర్ - శ్రీనగర్ మెయిన్ రోడ్ - మూడు వంతెనల అండర్ పాస్ - కొత్తపేట శివాలయం జంక్షన్ - గుంట గ్రౌండ్ సెంటర్ - RTC బస్టాండ్ ప్రాంతం - BR స్టేడియం సర్కిల్ - హిమనీ సెంటర్ - MTB సెంటర్ - ఉమెన్ కాలేజ్ సెంటర్ - నాజ్ సెంటర్ - రైల్వే స్టేషన్ - కోర్ట్ రోడ్డు - SBI బ్యాంక్, నగరం పాలెం - జిల్లా పోలీస్ కార్యాలయం.ఈ విధంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ డైవర్షన్ ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన సిగ్నలింగ్ ప్రదేశాలు మొదలగు వాటివి పరిశీలించి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో! పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవలసిన ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించవలసిన అవశ్యకత గురించి చర్చించారు. 📍రోడ్లపై ఎక్కడైనా ఆక్రమణలు గమనిస్తే మున్సిపల్ వారి సహకారంతో వెంటనే తొలగించాలని, వ్యాపార సముదాయాల ముందర వాహనాలు రోడ్లపై నిలపకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 📍RTC బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులు, ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను కేటాయించే విధంగా, అదే విధంగా బస్సులు, ట్రావెల్ బస్సులు నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా వాటికి నిర్ణీత బస్టాప్ లను కేటాయించే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సూచించారు. 📍నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సమయానికి తమ విధి నిర్వహణ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 📍వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ వారికి సహకరించాలని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 📍 గౌరవ ఎస్పీ గారికి నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల గురించి నగర ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ గారు, వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య గార్లు వివరించారు. 👉 ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డీఎస్పీ గారు,ట్రాఫిక్ సీఐలు, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, కొత్తపేట సీఐ వీరయ్య గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కృష్ణాజిల్లా :మచిలీపట్నం * *మచిలీపట్నంలో బార్ ఏర్పాటు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాహకులు*.. మచిలీపట్నం నగరంలో ప్రధాన రహదారి, జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయునున్న బార్‌పై స్థానికులు ,హైనిచర్చి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బార్ ఏర్పాట్లు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బార్ వ్యాపారం సాగిందని గుర్తుచేశారు. అయితే,స్థానికులు హైనీ చర్చి సభ్యులు బార్ ఏర్పాటు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు.1