సంక్రాంతి సంబరాల వేళ…. ప్రయాణికులపై ప్రైవేట్ బస్సుల దోపిడీ.... కుటుంబానికి ప్రయాణమే భారం... పండుగే లాభాల పంట... సంక్రాంతి అంటే పల్లె వాసన. పొలాల మధ్య గాలిలో కలిసిపోయే సంబరాలు. కానీ ఈ పండుగ ఆనందాన్ని చేరుకునే దారిలోనే సగటు మధ్యతరగతి కుటుంబానికి షాక్ తగులుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్ర గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే ప్రైవేట్ బస్సు ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ రోజుల్లో 500 నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే బస్సు చార్జీలు, పండుగ వేళ వచ్చేసరికి రెండు వేల రూపాయలకు చేరాయి. వైజాగ్ వైపు వెళ్లాలంటే మరింత దారుణం ఒక్క టికెట్‌కే మూడు వేల రూపాయలు.. కుటుంబానికి ప్రయాణమే భారం... ఒక కుటుంబంలో నలుగురు లేదా అయిదుగురు సభ్యులు ఉన్నారని తీసుకుంటే, ఒక్క వైపు ప్రయాణానికే 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చవుతోంది. రాకపోకలు కలిపితే 25 నుంచి 30 వేల రూపాయలు. ఏడాది పొడవునా పొదుపు చేసి పండుగను పల్లెల్లో జరుపుకోవాలనుకునే కుటుంబానికి ఇది అసాధ్యంగా మారుతోంది.. పండుగే లాభాల పంట... డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. “వెళ్లక తప్పదు” అన్న పరిస్థితిని అవకాశంగా మార్చుకుని లాభాల వేట సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.... రైల్వే రిజర్వేషన్లు నెలల ముందే నిండిపోవడం, ప్రభుత్వ బస్సులు సరిపడా లేకపోవడం వల్ల ప్రయాణికులు చివరకు ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితినే ట్రావెల్స్ యజమానులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నియంత్రణ అవసరం... పండుగల సమయంలో ప్రత్యేక బస్సులు నడపడం, ఛార్జీలపై స్పష్టమైన పరిమితి విధించడం వంటి చర్యలు తీసుకోకపోతే ఈ దోపిడీ ఆగేలా కనిపించడం లేదు. లేకపోతే సంక్రాంతి సంబరాలు పల్లెల్లో కాదు.బస్ టికెట్ రేట్ల గోడల మధ్యనే చిక్కుకుపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి ఆనందం ప్రజలది లాభాల పంట మాత్రం ప్రైవేట్ బస్సులదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఎవరు......

- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- 🙏🙏1