అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలి..వివో బిల్డింగ్‌లనిర్మాణంపై ద్దృష్టి సారించాలి..ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్-1 పనులు త్వరగా పూర్తి చేయాలి.. ఫేజ్-2 అమలుపై ప్రత్యేక దృష్టి..ఎంపీడీవోలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లాలో వివో (VVO) బిల్డింగ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఫామ్ పాండ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో వివో బిల్డింగ్‌ల నిర్మాణానికి సంబంధించి ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన బిల్డింగ్‌ల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, ఇంకా మంజూరు కాని చోట్ల వెంటనే ప్రతిపాదనలు పంపించి మంజూరు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివో బిల్డింగ్‌లకు స్థలాల కేటాయింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఇందుకు పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఫేజ్-1 పనులను సత్వరమే పూర్తి చేసి, ఫేజ్-2 అమలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకే పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని, అనర్హులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయవద్దని స్పష్టం చేశారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ఎంపీడీవోలు మిషన్ మోడ్‌లో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వానికి తావివ్వకుండా పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఓ గీత, డీపీఓ జగదీశ్వర్, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలి..వివో బిల్డింగ్‌లనిర్మాణంపై ద్దృష్టి సారించాలి..ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్-1 పనులు త్వరగా పూర్తి చేయాలి.. ఫేజ్-2 అమలుపై ప్రత్యేక దృష్టి..ఎంపీడీవోలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లాలో వివో (VVO) బిల్డింగ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఫామ్ పాండ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో వివో బిల్డింగ్‌ల నిర్మాణానికి సంబంధించి ఉన్న భూ సమస్యలను తక్షణమే
పరిష్కరించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన బిల్డింగ్‌ల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, ఇంకా మంజూరు కాని చోట్ల వెంటనే ప్రతిపాదనలు పంపించి మంజూరు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివో బిల్డింగ్‌లకు స్థలాల కేటాయింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఇందుకు పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఫేజ్-1 పనులను సత్వరమే పూర్తి చేసి, ఫేజ్-2 అమలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకే పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని, అనర్హులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయవద్దని స్పష్టం చేశారు. పూరి
గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ఎంపీడీవోలు మిషన్ మోడ్‌లో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వానికి తావివ్వకుండా పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఓ గీత, డీపీఓ జగదీశ్వర్, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు1
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- పట్నం సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి షాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత రుక్కమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మనుమడు పట్నం అవినాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికీ మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.2
- కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.1
- కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.2