logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్‌లో రూ.84 వేల విలువైన గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు రూ. 84 వేల విలువైన 1.680 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ పి. సర్వయ్య వివరాల ప్రకారం, ఎస్సై దీపి కారెడ్డి సిబ్బందితో బాలాజీ గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, షేక్ సోహెల్ మరియు ఎడ్ల రామ్ చరణ్ అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తుండగా వారి వద్ద గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు ఘటనాస్థలానికి తరలించారు. మహబూబాబాద్‌కు చెందిన క్రాంతి అనే మరో వ్యక్తి ఈ గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించమని వారిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఎస్సై దీపి కారెడ్డి ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న క్రాంతిని గుర్తించడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు.

1 hr ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

మహబూబాబాద్‌లో రూ.84 వేల విలువైన గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు రూ. 84 వేల విలువైన 1.680 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ పి. సర్వయ్య వివరాల ప్రకారం, ఎస్సై దీపి కారెడ్డి సిబ్బందితో బాలాజీ గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, షేక్ సోహెల్ మరియు ఎడ్ల రామ్ చరణ్ అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తుండగా వారి వద్ద గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు ఘటనాస్థలానికి తరలించారు. మహబూబాబాద్‌కు చెందిన క్రాంతి అనే మరో వ్యక్తి ఈ గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించమని వారిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఎస్సై దీపి కారెడ్డి ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న క్రాంతిని గుర్తించడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ:పంట కోత తరువాత పొలాల్లో మంట వేసే రైతుల ప్రవర్తన వల్ల భూమి సారం తగ్గిపోవడం, పంటలకు అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి సమస్యలు నెలకొంటున్నాయి. వాతావరణానికి హానికరమైన కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. కాకపోవాల్సిన ప్రమాదాలపై రైతులలో అవగాహన కల్పించడంలో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి సానుకూలమైన బాధ్యత తీసుకున్నారు. పోలీసులు శాంతి భద్రత కాపాడటం మాత్రమే కాకుండా, ప్రకృతిని రక్షించడంలో కూడా ముందంజ తీసుకుంటే, రైతులకు అవగాహన కల్పించారు . ఈ చర్యల ద్వారా భూమి సారం కాపాడుకోవచ్చు, పంటలకు కావలసిన పోషకాలులభించవచ్చు, వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.
    1
    హన్మకొండ:పంట కోత తరువాత పొలాల్లో మంట వేసే రైతుల ప్రవర్తన వల్ల భూమి సారం తగ్గిపోవడం, పంటలకు అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి సమస్యలు నెలకొంటున్నాయి. వాతావరణానికి హానికరమైన కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి.
కాకపోవాల్సిన ప్రమాదాలపై రైతులలో అవగాహన కల్పించడంలో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి  సానుకూలమైన బాధ్యత తీసుకున్నారు. పోలీసులు శాంతి భద్రత కాపాడటం మాత్రమే కాకుండా, ప్రకృతిని రక్షించడంలో కూడా ముందంజ తీసుకుంటే, రైతులకు అవగాహన కల్పించారు .
ఈ చర్యల ద్వారా భూమి సారం కాపాడుకోవచ్చు, పంటలకు కావలసిన పోషకాలులభించవచ్చు, వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    22 min ago
  • వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.
    3
    వరంగల్ జిల్లా :
ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. 
ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. 
ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. 
వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. 
గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    15 min ago
  • వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    1
    వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు.
అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు.
డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    1
    తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...*
*ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...*
*నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...*
సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!*
పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!!  ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    1
    యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది.
దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.
    1
    ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన  కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    12 hrs ago
  • వరంగల్:ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ పరిధిలో ఎల్లమ్మ తల్లి బోనాల నృత్యాల సమయంలో పెట్రోల్ సీసా మంటలు వ్యాపించడంతో నలుగురు గాయపడ్డారు. సపావట్ భిక్షపతి ఎల్లమ్మ పండగలో శివసత్తులు మంటలు పుట్టించగా, భిక్షపతి ఇంటికి వచ్చిన బంధువులు దేవమ్మ, నూన్ వత్ దేవేందర్, బాదావత్ బుజ్జి, బోడా పూల్యా మంటకు గురయ్యారు. 108 సిబ్బంది ఈఎంటీ రమేశ్ మరియు పైలట్ కె. భిక్షపతి గాయపడ్డ వారిని ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దేవమ్మ, బుజ్జి పరిస్థితి విషమంగా ఉంది.
    1
    వరంగల్:ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ పరిధిలో ఎల్లమ్మ తల్లి బోనాల నృత్యాల సమయంలో పెట్రోల్ సీసా మంటలు వ్యాపించడంతో నలుగురు గాయపడ్డారు.  సపావట్ భిక్షపతి ఎల్లమ్మ పండగలో శివసత్తులు మంటలు పుట్టించగా, భిక్షపతి ఇంటికి వచ్చిన బంధువులు దేవమ్మ, నూన్ వత్ దేవేందర్, బాదావత్ బుజ్జి, బోడా పూల్యా మంటకు గురయ్యారు.
108 సిబ్బంది ఈఎంటీ రమేశ్ మరియు పైలట్ కె. భిక్షపతి గాయపడ్డ వారిని ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దేవమ్మ, బుజ్జి పరిస్థితి విషమంగా ఉంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.