logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్‌లోని ఓయూ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన కనీస వేతనాలు అమలు చేయడం లేదని, దీనికి నిరసనగా జులై 13 నుండి హాస్టల్స్, మెస్ బంద్ చేసి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ప్రకటించింది. శనివారం వివిధ హాస్టల్స్‌లో కార్మికులతో జరిగిన సమావేశం అనంతరం యూనియన్ ఓయూ గౌరవ అధ్యక్షులు ఎస్. ఎల్ పద్మ, అధ్యక్షులు కె. ఎస్ ప్రదీప్, కార్యదర్శి శివాజీలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయపరంగా రావాల్సిన వారపు సెలవు (వీక్లీ ఆఫ్), 20 రోజులకు ఒక క్యాజువల్ లీవ్, జాతీయ లేదా పండుగ సెలవులు ఇవ్వడం లేదా ఆ రోజుల్లో పని చేస్తే డబుల్ జీతం ఇవ్వడం వంటి నియమాలను అధికారులు అమలు చేయడం లేదని యూనియన్ నేతలు మండిపడ్డారు. అంతేకాకుండా, 2022 నుండి కనీసం వి.డి.ఎ (V.D.A) కూడా అమలు చేయకపోవడంతో కార్మికులు అతి తక్కువ జీతాలకే పనిచేయాల్సి వస్తోందని, ఇది వెట్టిచాకిరి కిందకే వస్తుందని ఆరోపించారు. వీటిని అమలు చేయాలని లేబర్ కమీషనర్ స్వయంగా యూనివర్సిటీకి లేఖ రాసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి తమ జీతాలు పెంచాలని, లేని పక్షంలో జులై 13 నుండి హాస్టల్స్, మెస్ బంద్ చేసి సమ్మెకు దిగుతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ సమ్మె వల్ల కలిగే ఇబ్బందులను విద్యార్థులు అర్థం చేసుకోవాలని వారు కోరారు.

6 hrs ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
6 hrs ago
2567476e-2801-442f-9ca2-d61f8d2da8b0

హైదరాబాద్‌లోని ఓయూ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన కనీస వేతనాలు అమలు చేయడం లేదని, దీనికి నిరసనగా జులై 13 నుండి హాస్టల్స్, మెస్ బంద్ చేసి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ప్రకటించింది. శనివారం వివిధ హాస్టల్స్‌లో కార్మికులతో జరిగిన సమావేశం అనంతరం యూనియన్ ఓయూ గౌరవ అధ్యక్షులు ఎస్. ఎల్ పద్మ, అధ్యక్షులు కె. ఎస్ ప్రదీప్, కార్యదర్శి శివాజీలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయపరంగా రావాల్సిన వారపు సెలవు (వీక్లీ ఆఫ్), 20 రోజులకు ఒక క్యాజువల్ లీవ్, జాతీయ లేదా పండుగ సెలవులు ఇవ్వడం లేదా ఆ రోజుల్లో పని చేస్తే డబుల్ జీతం ఇవ్వడం వంటి నియమాలను అధికారులు అమలు చేయడం లేదని యూనియన్ నేతలు మండిపడ్డారు. అంతేకాకుండా, 2022 నుండి కనీసం వి.డి.ఎ (V.D.A) కూడా అమలు చేయకపోవడంతో కార్మికులు అతి తక్కువ జీతాలకే పనిచేయాల్సి వస్తోందని, ఇది వెట్టిచాకిరి కిందకే వస్తుందని ఆరోపించారు. వీటిని అమలు చేయాలని లేబర్ కమీషనర్ స్వయంగా యూనివర్సిటీకి లేఖ రాసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి తమ జీతాలు పెంచాలని, లేని పక్షంలో జులై 13 నుండి హాస్టల్స్, మెస్ బంద్ చేసి సమ్మెకు దిగుతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ సమ్మె వల్ల కలిగే ఇబ్బందులను విద్యార్థులు అర్థం చేసుకోవాలని వారు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    22 min ago
  • Post by Assalamualikumjj
    3
    Post by Assalamualikumjj
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    59 min ago
  • బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.

ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    1 hr ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.
    1
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.
    1
    సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    2 hrs ago
  • మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. బూత్ నంబర్-78 పరిధిలో మొత్తం 688 మంది ఓటర్లు ఉండగా, వారిలో ఇప్పటికే 390 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ వెల్లడించారు. మిగిలిన ఓటర్లు కూడా గడువు ముగిసేలోపు తమ వివరాలను నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు.
    1
    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా సాగుతోంది. బూత్ నంబర్-78 పరిధిలో మొత్తం 688 మంది ఓటర్లు ఉండగా, వారిలో ఇప్పటికే 390 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ వెల్లడించారు. మిగిలిన ఓటర్లు కూడా గడువు ముగిసేలోపు తమ వివరాలను నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • 😋😋😋
    1
    😋😋😋
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.