logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..* *ఆరుగురి మృతి* : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.! ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్‌ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో మొత్తం 42 మంది ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

5 hrs ago
user_Senior Jounalist @saidulu
Senior Jounalist @saidulu
Local News Reporter దేవరకొండ, నల్గొండ, తెలంగాణ•
5 hrs ago
49d8a39a-8525-4326-85f6-ae9e258a72e8

*సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..* *ఆరుగురి మృతి* : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.! ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్‌ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో మొత్తం 42 మంది ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

More news from Nalgonda and nearby areas
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    1 hr ago
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు
కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    1
    మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    1
    బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    1
    స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    20 hrs ago
  • *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    1
    *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర  బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి*
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    user_Senior Jounalist @saidulu
    Senior Jounalist @saidulu
    Local News Reporter దేవరకొండ, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    1
    హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.