logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఓయూ లో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2 hrs ago
user_దినేష్ కుమార్
దినేష్ కుమార్
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
2 hrs ago

ఓయూ లో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ

రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు ​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    1
    తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు
​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    1 hr ago
  • హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్గుల్ కి చెందిన కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
    4
    హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నాదర్గుల్ కి చెందిన
కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు 
నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే  AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది.
ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి 
సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/
ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్ దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు  వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి  తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్  దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా  కెసిఆర్ రావాలని ప్రజలు  కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు  ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్  కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం! ​గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్‌పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు. ​కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్‌ను రన్‌వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
    1
    కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం!
​గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్‌పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు.
​కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్‌ను రన్‌వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    4 hrs ago
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    2
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామం లో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కాకునూరు సుందరాపురం ప్రభ ఎదుర్కోళ్ళు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో హారతులు, భజనలు, సాంప్రదాయ వాద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం, ప్రసాద పంపిణీ నిర్వహించి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
    1
    కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామం లో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కాకునూరు సుందరాపురం ప్రభ ఎదుర్కోళ్ళు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో హారతులు, భజనలు, సాంప్రదాయ వాద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం, ప్రసాద పంపిణీ నిర్వహించి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.