logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాటిపర్తిలో చేనేతల ఆమరణ నిరాహార దీక్ష - దీక్షకు దిగిన బేవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ పిఠాపురం : చేనేతల సమస్యల పరిష్కారం కోరుతూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మంగళవారం ఈ దీక్షను చేపట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 13 నుంచి 20 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ప్రకటించినట్లే ఏప్రిల్ 21 నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతల డిమాండ్లను వెల్లడించారు. సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రద్దైన త్రిఫ్ట్, పావలా వడ్డీ రుణం, యార్న్ సబ్సిడీ, 30% రిబేట్, రుణమాఫీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు ముడిసరుకు అందించి ఉపాధి కల్పించాలని, ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.1000 కోట్లు కేటాయించాలని, నేతన్న భరోసా రూ.25 వేలు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే చేనేత రంగం నిర్లక్ష్యానికి కారణమని ఆరోపిస్తూ ఆప్కో ఎండీ రేఖ రాణిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు తీర్చే వరకు శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

2 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
2 hrs ago
735dbe03-8732-4b8c-9b64-94895d701b2f

తాటిపర్తిలో చేనేతల ఆమరణ నిరాహార దీక్ష - దీక్షకు దిగిన బేవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ పిఠాపురం : చేనేతల సమస్యల పరిష్కారం కోరుతూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మంగళవారం ఈ దీక్షను చేపట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 13 నుంచి 20 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ప్రకటించినట్లే ఏప్రిల్ 21 నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతల డిమాండ్లను వెల్లడించారు. సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రద్దైన త్రిఫ్ట్, పావలా వడ్డీ రుణం, యార్న్ సబ్సిడీ, 30% రిబేట్, రుణమాఫీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు ముడిసరుకు అందించి ఉపాధి కల్పించాలని, ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.1000 కోట్లు కేటాయించాలని, నేతన్న భరోసా రూ.25 వేలు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే చేనేత రంగం నిర్లక్ష్యానికి కారణమని ఆరోపిస్తూ ఆప్కో ఎండీ రేఖ రాణిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు తీర్చే వరకు శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
    1
    పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు.
పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    8 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పిఠాపురంలో కూటమి నేత‌ల ఫ్లెక్సీ రగడ పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘ‌ర్ష‌ణ‌ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం
    1
    పిఠాపురంలో కూటమి నేత‌ల ఫ్లెక్సీ రగడ
పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ.
టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు
పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘ‌ర్ష‌ణ‌
ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం
వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు
దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Sageni gangadhar
    1
    Post by Sageni gangadhar
    user_Sageni gangadhar
    Sageni gangadhar
    జి. మడుగుల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    49 min ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది.
డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది.
స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    7 hrs ago
  • చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    2
    చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    user_Gurrala vigeswara ramarao
    Gurrala vigeswara ramarao
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.