దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాపై- ఆసిఫాబాద్ పోలీసుల ఉక్కుపాదం* *అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత* *జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు* రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖైర్‌గావ్ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ బి. అశోక్, రెబ్బెన సీఐ ఎం. సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. తేదీ 07.09.2026న రెబ్బెన మండలం ఖైర్‌గావ్ గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.ఇంటి యజమానులు బంధువు మృతి కారణంగా తాండూర్‌కు వెళ్లి ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీనిని గమనించిన నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి,ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ రోజు కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేశారు. కారులో తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామాగ్రితో పాటు బంగారం,వెండి లభించాయి.కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా,తాండూర్, ఖైర్‌గావ్,జాకులపల్లి,రెబ్బెన ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల వివరాలు 1. ఊపట్ల ప్రణయ్, తండ్రి తిరుపతి, వయసు 30 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్. 2. మంచెర్ల సతీష్ కుమార్, తండ్రి పోచం, వయసు 29 సంవత్సరాలు, శంభాజీ నగర్, తాండూర్. 3. రాజేశం, తండ్రి మల్లయ్య, వయసు 32 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్. 4. శాలిగామ కృష్ణ, తండ్రి నీలయ్య, వయసు 32 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నవీ - 10.3 తులాల బంగారం - 30 తులాల వెండి - 4 మొబైల్ ఫోన్లు - నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు - తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామాగ్రి నిందితులను కోర్టులో హాజరుపరిచి,న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ బి. అశోక్, రెబ్బెన సీఐ ఎం. సంజయ్,ఎస్ఐ వెంకట కృష్ణ,హెచ్‌సీ రవి కుమార్,పీసీ నౌషాద్,పీసీ వెంకటేష్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ అభినందించారు.

- జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్1
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.! - సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయాలి. కే రాజన్న. జిల్లా కార్యదర్శి సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. ఈరోజు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా" పాటిస్తూ గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో *సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కార్యదర్శి కే రాజన్న* మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000.గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలకు పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 4,000 మంది అమర వీరులైనారు.తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం భూస్వాముల అరాచకం, వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వం పై తిరగబడి విరోచితంగా రైతంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. చరిత్రను మరచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అమర వీరుల త్యాగాలను పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని, విమోచ అని పాలకులు ఈ రోజు వక్రీకరిస్తున్నారని అన్నారు. "సెప్టెంబర్.17. ముమ్మాటికి విద్రోహమే" అని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. భావిస్తుందన్నారు. ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ పోరాట స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న,ఐ ఎఫ్ టీ యు. జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ప్రధాన కార్యదర్శి బి అశోక్,ఏ ఐ కే ఎం ఎస్. జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశం, ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు ఐ రాజేశం,ఎం దుర్గయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, కాసర్ల మల్లేష్,ఎం కొమరయ్య,కోట వెంకన్న , పోగుల శేఖర్, రామారావు, జనగామ రాజన్న, చంటి బానయ్య, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.1
- వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Shaikshada1
- నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం1