రాజధాని పై జగన్ మూడు ముక్కలాట డ్రామాలు ఆడటం మానుకోవాలి.... టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్.... మండపేట న్యూస్: రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ మరో మారు కుట్రకు తెర లేపారనీ టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ ఆరోపించారు .రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి పదే పదే విషం చిమ్ముతూనే ఉన్నారన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో మూడు రాజధానులు అని మూడుముక్కలాట ఆడి ఇప్పుడు మూడు నాలుకల ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారనీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ ధ్వజమెత్తారు. గత 5 సంవత్సరాల పాలనలో రాజధాని లేకుండా చేశారన్నారు. ఇప్పుడు రాజధాని పదమే లేదంటున్నారన్నారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చేసిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవగాహన లేకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారనీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 5 లో ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధాని హైదరాబాదు 10 సంవత్సరాలలోపు ఉంటుందని స్పష్టం చేశారు. తరువాత సెక్షన్ 6-1 లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని దానిమీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పిందన్నారు. ఆ కమిటీ శ్రీకృష్ణ కమిటీ దాని ఆధారంగా చేసుకుని 2014 అసెంబ్లీలో అందరూ ఏకగ్రీవం తీర్మానం చేశారన్నారు. ఇప్పుడు రాజధానిపైఒక అడుగు ముందుకేసి రాజధాని నదీ గర్భంలో ఉందని, ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అంటున్నారనీ జగన్ వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పనులను పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక అమరావతిపై డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఒక ప్రక్క చంద్రబాబునాయుడు మరొక ప్రక్క లోకేష్ పవన్ కళ్యాణ్ పెట్టుబడే లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనీ పేర్కొన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. ఇకనైనా అమరావతిపై డ్రామాలు ఆపాలని లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఇప్పటికే 11 సీట్లతో సరిపెట్టారని అందుకే ఇకనైనా జగన్ మనసు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని సల్మాన్ హితవు పలికారు.

- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- 🙏🙏1