కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పోలీసుల అరైవ్ అలైవ్... రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.

- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్1
- జగిత్యాల జిల్లా… జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించి పక్కనే లాటుగా వేసి ఉంచిన సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసాయి. ఏబీవీపీ జెండాలు, ప్రోటోకాల్ వివాదం కలకలం సృష్టించింది. అధికారులు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జయంతి వేడుకలు ఆందోళనలు నిరసనలు అరెస్టుల మధ్య సాగాయి. ప్రోటోకాల్ వివాదం, ఏబీవిపి జెండాలు లొల్లికి దారి తీశాయి ఏబీవీపీ జండాలతో అంబేద్కర్ విగ్రహానికి ఎబివిపి పూలమాలలు వేస్తుండగా దళిత సంఘాలు అభ్యంతరం తెలిపిపాయి. తాము దళితులమే అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఘాటుగా సమాధానం చెప్పడంతో దళితులకు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. పరస్పర నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బలవంతంగా వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. మరోవైపు వేదికపైకి దళిత సంఘాల ప్రతినిధులను పిలువలేదని నిరసన పలువురు దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. వేదిక పైకి దూసుకెళ్లి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ముఖ్యనేతలు, అధికారులను మాత్రమే వేదిక పైకి పిలిచామని రాద్ధాంతం చేయొద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సముదాయించి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.2
- జగిత్యాల : తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ మరియు సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వారం రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత పోస్టర్ ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసం లో వారి చేతులమీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన అగ్నిమాపక ఆఫీసర్ మరియు సిబ్బంది.. ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు...1
- మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని ఆమె అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని, చేతులు మారాయని మీపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. అలాగే, “చెప్పుతో కొడతానని అంటే మా దగ్గర చెప్పులు లేవా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.1