జన హృదయ నేత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని కడ్తాల్ మాజీ జడ్పిటిసి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్. మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ నాయకులు ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను కలిసి శాలువా కప్పి,పూలమాల వేసి అత్యంత ఘనంగా సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. పదవిలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించే గొప్ప జన హృదయ నేత జైపాల్ యాదవ్ అని వారు పేర్కొన్నారు. నియోజకవర్గ వికాసానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, నిరుపేదలకు, కార్యకర్తలకు ఆయన ఎల్లప్పుడూ కొండంత అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియా రమేష్ నాయక్ డైరెక్టర్ జోగు వీరయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ మాజీ ఎంపిటిసి లచ్చిరాం నాయక్ నాయకులు మంగళపల్లి నరసింహ కోట్య గోపాల్ పర్వతాలు యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మంగనూర్ లో బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ గారి 108వ జయంతి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామం లోని బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల నూతన విగ్రహాల దిమ్మె దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి.పి. మండల్ ) గారి 108వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో మంగనూర్ గ్రామం సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బోట్క చంద్రశేఖర్, వార్డు మెంబర్ కత్తి పరశురాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, తోట జయరాములు, నక్కల సాయులు, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, అప్పల మల్లేష్, ఇండ్ల మల్లిఖార్జున్, కుమ్మరి సాంబశివ, వంక ఎల్లయ్య, దాసరి అంజి, వడ్ల నరేష్, పిట్టల నిరంజన్, అప్పల శ్రీను, సల్ల భీమయ్య, కొంగిరి లక్ష్మయ్య, నరసగల్ల కురుమూర్తి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1