logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ వీధి, 1వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు కోరారు. ఈ మేరకు ఆమె శనివారం వనపర్తి పట్టణ ఏఈని కలిసి వినతి పత్రం అందజేశారు. కమాన్ చౌరస్తా, రాయిగడ్డ వీధి, తెలుగువాడ, మండ్లగేరితో పాటు కొత్తగా నిర్మించిన ఇళ్ల ప్రాంతాల్లో కరెంట్ తీగలు ప్రమాదకరంగా కిందకు జారిపోయాయని, గతంలో వేసిన ఇనుప స్తంభాలు, పాత సిమెంట్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయని కౌన్సిలర్ పేర్కొన్నారు. గతంలో రాయిగడ్డ మీదుగా వ్యవసాయ బావులకు విద్యుత్ లైన్లు ఉండేవని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, కాబట్టి ఆ కరెంట్ లైన్ అవసరం లేదని, వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వార్డులో ప్రతిరోజు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు గృహ అవసరాలకు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే 11KV లైన్‌కు కనెక్షన్లు అనుసంధానం చేసి సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, బోయిని తిరుమల్, సింగనమోని ఆంజనేయులు, రామకృష్ణ, మోహన్, భాస్కర్, మన్నెం, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

10 hrs ago
user_RK JOURNALIST
RK JOURNALIST
వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
10 hrs ago
49378aa5-e656-456c-bb7c-2990dced1f62

వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ వీధి, 1వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు కోరారు. ఈ మేరకు ఆమె శనివారం వనపర్తి పట్టణ ఏఈని కలిసి వినతి పత్రం అందజేశారు. కమాన్ చౌరస్తా, రాయిగడ్డ వీధి, తెలుగువాడ, మండ్లగేరితో పాటు కొత్తగా నిర్మించిన ఇళ్ల ప్రాంతాల్లో కరెంట్ తీగలు ప్రమాదకరంగా కిందకు జారిపోయాయని, గతంలో వేసిన ఇనుప స్తంభాలు, పాత సిమెంట్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయని కౌన్సిలర్ పేర్కొన్నారు. గతంలో రాయిగడ్డ మీదుగా వ్యవసాయ బావులకు విద్యుత్ లైన్లు ఉండేవని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, కాబట్టి ఆ కరెంట్ లైన్ అవసరం లేదని, వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వార్డులో ప్రతిరోజు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు గృహ అవసరాలకు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే 11KV లైన్‌కు కనెక్షన్లు అనుసంధానం చేసి సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, బోయిని తిరుమల్, సింగనమోని ఆంజనేయులు, రామకృష్ణ, మోహన్, భాస్కర్, మన్నెం, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు. ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు.

ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_RK JOURNALIST
    RK JOURNALIST
    వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
    3 hrs ago
  • ధరూరు మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూమిని గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తుల నుండి విడిపించి, ఆ భూమిని దేవస్థాన సేవకులకు వ్యవసాయం చేసుకోవడానికి అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు తీవ్రంగా వేడుకుంటున్నారు. దేవాలయ భూమిని తక్షణమే కాపాడాలని, ప్రస్తుత పరిస్థితిలో దానిని అలాగే వదిలేస్తే పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ధరూరు మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూమిని గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తుల నుండి విడిపించి, ఆ భూమిని దేవస్థాన సేవకులకు వ్యవసాయం చేసుకోవడానికి అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు తీవ్రంగా వేడుకుంటున్నారు. దేవాలయ భూమిని తక్షణమే కాపాడాలని, ప్రస్తుత పరిస్థితిలో దానిని అలాగే వదిలేస్తే పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • కేశంపేట మండలంలో శనివారం ఉదయం నుండి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు బలంగా ఊగిపోతున్నాయి, అలాగే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో చల్లదనం పెరిగింది. రహదారులపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు తమ పంటలను, వ్యవసాయ సామగ్రిని రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, గాలుల దాటికి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
    1
    కేశంపేట మండలంలో శనివారం ఉదయం నుండి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు బలంగా ఊగిపోతున్నాయి, అలాగే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో చల్లదనం పెరిగింది.

రహదారులపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు తమ పంటలను, వ్యవసాయ సామగ్రిని రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, గాలుల దాటికి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన నంద్యాల జిల్లా మహానంది : కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన
నంద్యాల జిల్లా మహానంది :  కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం బాలల హక్కుల సదస్సు నిర్వహించారు. మహిళా వారసవల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాలికలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చని, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి స్పష్టం చేశారు.
    1
    99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం బాలల హక్కుల సదస్సు నిర్వహించారు. మహిళా వారసవల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాలికలతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చని, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి స్పష్టం చేశారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    బొమరాస్‌పేట, వికారాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆళ్లగడ్డ వీరాయిపల్లె సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో నరేంద్ర సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆళ్లగడ్డ వీరాయిపల్లె సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జయింది.

ఈ ఘోర ప్రమాదంలో నరేంద్ర సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    12 hrs ago
  • నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    1
    నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    1
    మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.