logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పట్టు వదలని విక్రమార్కుడిలాఅంతరాష్ట్ర దొంగ పట్టుకున్న కల్వకుర్తి సీ.ఐ.నాగార్జున ఎస్సై మాధవరెడ్డి నిందితుడు నాగిరెడ్డి నేర చరిత్ర ఐదు రాష్ట్రాల్లో చోరీలు చేస్తూ 45 కేసుల్లో నిందితుడు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపూరానికి చెందిన తెలుగు మల్లెపూల నాగిరెడ్డి (33) కథ ఇది. 18వ ఏట నుంచే చోరీలకు అలవాటు పడిన నాగిరెడ్డి, జల్సాల కోసం నేరాలను జీవనాధారంగా మార్చుకున్నాడు. ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చోరీలు చేస్తూ, పోలీసులకు దొరికిన ప్రతిసారీ చాకచక్యంగా తప్పించుకోవడంలో ఆరితేరాడు. 2023లో వైయస్సార్ కడప జిల్లా కొండాపురంలో పోలీసుల అదుపులోకి వచ్చిన నాగిరెడ్డి, అక్కడి నుంచి తప్పించుకోవడంతో ఏకంగా 11 మంది పోలీసులు సస్పెండ్ కావాల్సి వచ్చింది. ఈ ఘటన పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. “పోలీసుల నిర్లక్ష్యం”, “లోపలి కుమ్మక్కు” అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయిరోడ్డు ప్రమాదమే కీలక మలుపుఅనంతపురం జిల్లా విడపనకల్లు శివారులోని 42వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాగిరెడ్డి నేరచరిత్రను వెలుగులోకి తెచ్చింది. నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో, అందులో ఉన్న దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గుంతకల్లు డీ.ఎస్పీ. శ్రీనివాస్, సీఐ మహానంది, నిందితుడు ప్రయాణిస్తున్న కారులో 3 లక్షల నగదు, పలు ఆభరణాలు గుర్తించడంతో అనుమానాలు బలపడ్డాయి. విచారణలో అతని అంతరాష్ట్ర నేరచరిత్ర బయటపడటంతో ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారుకల్వకుర్తిలో మరోసారి తప్పించుకున్నాడు.రిమాండ్ ఖైదీగా ఉన్న నాగిరెడ్డిని, కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల విచారణ నిమిత్తం కల్వకుర్తికి తీసుకువచ్చారు.పోలీసులను బురిడీ కొట్టడంలో నిపుణుడైన నాగిరెడ్డి, ఇక్కడ కూడా తన చాకచక్యంతో స్టేషన్ నుంచి తప్పించుకోవడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు.ఈ ఆరోపణలు కల్వకుర్తి పోలీసుల సీ.ఐ.నాగార్జున ఎస్సై మాధవరెడ్డి సీరియస్ తీసుకొని పనితీరుపై ప్రశ్నార్థకం వేసినావారు వెనకడుగు వేయలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసులోకల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి బృందం పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు హైదరాబాద్ సరూర్‌నగర్ లింగోజీగూడ బస్తిలో నాగిరెడ్డి తన ప్రియురాలితో ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో, సంయుక్త బృందం పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించింది. చివరకు, పోలీసుల నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్న నాగిరెడ్డి ఈసారి తప్పించుకోలేకపోయాడు.పోలీసు వ్యవస్థపై విశ్వాసానికి బలంఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది ఏ పోలీసు అధికారి తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి నేరస్తులతో చేతులు కలపడు.తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవు. కానీ వ్యవస్థ మొత్తం మీద అసత్య ఆరోపణలు చేయడం సరికాదు.చట్టానికి లోబడి పౌరుల ధన, మాన, ప్రాణాలను రక్షించడమే పోలీసుల ప్రధాన బాధ్యత.నాగిరెడ్డి ఉదంతం ద్వారా కల్వకుర్తి పోలీసులు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.తప్పు చేసినవారు ఎంతటి వారు అయినా, ఎంతకాలం తప్పించుకున్నా, చివరకు చట్టం ముందు తలవంచాల్సిందే. పోలీసుల కళ్లను కప్పి శాశ్వతంగా తప్పించుకోవడం అసాధ్యం.అనుమానాల నడుమనిలబడ్డప్పటికీ,పట్టుదల,సమన్వయం,వృత్తి నిబద్ధతతో నిందితుడిని పట్టుకుని, పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించిన కల్వకుర్తి సీఐ నాగార్జున. ఎస్సై మాధవరెడ్డి పనితీరు ప్రశంసనీయం.

3 days ago
user_Shaik Habeeb
Shaik Habeeb
Journalist కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
3 days ago
51a37601-77ef-4d9c-87b4-beeedc59b66a

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    user_J. Bhaskar
    J. Bhaskar
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    7 hrs ago
  • *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...*
*బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* 
*విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం 
*ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.*
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    1
    చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు  విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర  పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* 
*మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని  నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* 
ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    5 hrs ago
  • సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    1
    సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
    1
    గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్
👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు.
గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్,  ఎల్లు రామ్ రెడ్డి,  గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    3 hrs ago
  • సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి
    1
    సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    9 hrs ago
  • మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    user_J. Bhaskar
    J. Bhaskar
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.