మైనర్ బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు.. యువకుడు అరెస్ట్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అడ్డగూడూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవి గురువారం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 28న మండలానికి చెందిన ఓ మహిళ తన మైనర్ కుమార్తె కనిపించడం లేదని, ఆమె అదృశ్యానికి అడ్డగూడూరు గ్రామానికి చెందిన ఎలిజాల ఉమేష్ కారణమని ఫిర్యాదు చేసింది. దీంతో అదే రోజు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో బాలిక అడ్డగూడూరు చింతలగడ్డ సమీపంలో ఒంటరిగా వస్తుండగా కుటుంబ సభ్యులకు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాలికను భువనగిరిలోని భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలం నమోదు చేశారు. బాలిక వాంగ్మూలంలో తనపై ఎలిజాల ఉమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించడంతో, పోలీసులు పోక్సో కేసుగా మార్చారు. దర్యాప్తులో భాగంగా అడ్డగూడూరు గ్రామానికి చెందిన నిందితుడు ఎలిజాల ఉమేష్ (24) డ్రైవర్‌ను రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవి ఆధ్వర్యంలో గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు బాలిక 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమ పేరుతో, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగికదాడి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ ఎం. రవి తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువును మధ్యలో నిలిపివేసి ఇంటి వద్దే ఉంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీఐ ఎం. రవి తెలిపారు. వెంట ఎస్ఐ వెంకటరెడ్డి ఉన్నారు.

- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత కొనసాగింపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రస్తుతం 8,03,370 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.1
- వరద ప్రభావం తగ్గడంతో బొగత జలపాతానికి గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి పర్యాటకులకు అనుమతి ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొగత జలపాతాన్ని శనివారం నుంచి సందర్శకులకు తిరిగి అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాతం కొలనులోకి దిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. సందర్శకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటిస్తూ, అధికారుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.1