*ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుంది.* *డయల్ 100, బ్లూ కోర్ట్, సిబ్బందికి సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ.* *ప్రమాదాలలో రక్షించిన వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు "రహ వీర్" తో గుర్తింపు నగదు రివార్డు.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 17 :- *ప్రమాదంలో గాయపడిన వారి ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చిన ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స.* *సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* “అరైవ్ అలైవ్” వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి అధ్యక్షతన రిమ్స్ ఆసుపత్రి నిష్ణాతులైన అనస్తేషియా వైద్యులచే డయల్ 100, బ్లూ కోర్ట్, స్పెషల్ పార్టీ, ఏ ఆర్ సిబ్బందికి సిపిఆర్ (CPR) మరియు ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని, గోల్డెన్ అవర్‌లోపు బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ-వీర్” పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని, అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి శిక్షణను అందించి ప్రాణాపాయ సమయంలో రక్షించేలా సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ ఐ లు, రిజర్వ్ సిబ్బంది రిమ్స్ వైద్యులు అనస్థీషియా డా శ్యామ్ సుందర్, డా గంగాధర్, డా వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుంది.* *డయల్ 100, బ్లూ కోర్ట్, సిబ్బందికి సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ.* *ప్రమాదాలలో రక్షించిన వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు "రహ వీర్" తో గుర్తింపు నగదు రివార్డు.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 17 :- *ప్రమాదంలో గాయపడిన వారి ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చిన ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స.* *సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* “అరైవ్ అలైవ్” వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి అధ్యక్షతన రిమ్స్ ఆసుపత్రి నిష్ణాతులైన అనస్తేషియా వైద్యులచే డయల్ 100, బ్లూ కోర్ట్, స్పెషల్ పార్టీ, ఏ ఆర్ సిబ్బందికి సిపిఆర్ (CPR) మరియు ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని, గోల్డెన్ అవర్‌లోపు బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను
రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ-వీర్” పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని, అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్
మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి శిక్షణను అందించి ప్రాణాపాయ సమయంలో రక్షించేలా సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ ఐ లు, రిజర్వ్ సిబ్బంది రిమ్స్ వైద్యులు అనస్థీషియా డా శ్యామ్ సుందర్, డా గంగాధర్, డా వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- మెట్ పల్లి, ఏప్రిల్ 17 (నినాదం) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ డి.ఏలు, పీఆర్‌సీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.3
- ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- Post by Boke saikumar Boke saikumar1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- I stand with you, and once I am in power, I will give them back to you. Together, we will protect your livelihoods and ensure that privatization never harms Andhra Pradesh’s future.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1