logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బత్తలపల్లి లో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీ సత్యసాయి జిల్లా,పేదల ఇళ్లలో వెలుగు నింపే ‘పీఎం సూర్య ఘర్’ పథకం – మంత్రి సత్యకుమార్ యాదవ్ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారులుగా ప్రజలు – మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త తో ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచిత సోలార్ – మంత్రి సత్యకుమార్ యాదవ్ పేదలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే మహత్తర పథకం – మంత్రి సత్యకుమార్ యాదవ్ బత్తలపల్లి, ఏప్రిల్ 14:– బత్తలపల్లి మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు 2 కిలోవాట్ల ఉచిత సోలార్ రూఫ్‌టాప్ యూనిట్ల ఏర్పాటు పై నిర్వహించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ పాల్గొని అదేవిధంగా, లబ్ధిదారులకు మంజూరు పత్రాలన మంత్రి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… దేశంలో పేదలపై పడుతున్న విద్యుత్ భారం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆలోచించి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ను ప్రవేశపెట్టారని తెలిపారు. విద్యుత్ తీగలు, స్తంభాల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గిస్తూ, ప్రతి ఇంటికి సురక్షితంగా మరియు ఉచితంగా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ పథకం కింద 2 కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ₹1,20,000 ఖర్చు అవుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వం ₹60,000 సబ్సిడీ ఇస్తుందని వివరించారు. మిగతా ₹60,000ను రాష్ట్ర ప్రభుత్వం (ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో) ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా భరించడం వల్ల వారికి ఈ యూనిట్ పూర్తిగా ఉచితంగా అందుతుందని తెలిపారు. ఈ సోలార్ వ్యవస్థ ద్వారా నెలకు సుమారు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీనివల్ల కుటుంబాలు నెలకు సుమారు ₹600 వరకు విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. అదనంగా, వినియోగానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కం కు అమ్ముకోవచ్చని, ఈ విధంగా కుటుంబాలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని తెలిపారు. అలాగే, ఇంట్లో 150 యూనిట్లు మాత్రమే వినియోగించినట్లయితే మిగిలిన యూనిట్లను విక్రయించడం ద్వారా సంవత్సరానికి వేల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రజలు కేవలం వినియోగదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారే గొప్ప అవకాశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ పథకం ప్రయోజనం పొందడానికి ప్రజలు కేవలం నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకుంటే సరిపోతుందని, అనంతరం సంబంధిత అధికారులు, ఏజెన్సీలు ఇంటికే వచ్చి సోలార్ ప్యానెల్స్, మీటర్లు, ఎలక్ట్రికల్ కనెక్షన్లు పూర్తిగా ఏర్పాటు చేస్తారని తెలిపారు. బీసీ వర్గాలకు కూడా ఈ పథకం కింద అధిక సబ్సిడీలు లభిస్తున్నాయని, ఇతర వర్గాల వారు 3 కిలోవాట్ల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి ₹78,000 వరకు సబ్సిడీ పొందవచ్చని మంత్రి తెలిపారు. అవసరమైన మిగిలిన మొత్తాన్ని డిస్కం ద్వారా రుణంగా పొందే సౌకర్యం కూడా ఉందని వివరించారు. ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పథకానికి నమోదు చేసుకుంటున్నారని, ముఖ్యంగా బత్తలపల్లి మండలంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే నమోదు చేసుకున్న లబ్ధిదారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి గ్రామంలో ఈ పథకం గురించి అవగాహన పెంచి, ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ పథకం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా, ప్రమాదాల నివారణ, అలాగే అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే రైతుల కోసం పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పంపులు ఏర్పాటు చేసుకుని, విద్యుత్ సమస్యల నుండి బయటపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. జారీచేసిన వారు : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యుల వారి కార్యాలయం.

7 hrs ago
user_Saddala Adi Narayana Reporter
Saddala Adi Narayana Reporter
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
a7252131-a8ab-4095-97f2-ed658bc7dc2e

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ధర్మవరం.. ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అక్కడే కేక్ కట్ చేసి కాలనీ ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున యువకులు గ్రామంలో బైక్ ర్యాలీ లో అంబేద్కర్ నినాదాలు చేస్తూ చేపట్టారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి కాలనీ అభివృద్ధికి పాటుపడదామని వక్తలు ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడతాయని కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనరసింహలు, శ్రావణ్, శ్రీకాంత్, బద్రి, నరేంద్ర, సతీష్, పవన్, ఓం శేఖర్, నవీన్, భార్గవ్, నవీన్ కుమార్,మధు,వంశీ,కదరయ్య, కాటమయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
    2
    ధర్మవరం..
ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అక్కడే కేక్ కట్ చేసి కాలనీ ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున యువకులు  గ్రామంలో బైక్ ర్యాలీ లో అంబేద్కర్ నినాదాలు చేస్తూ చేపట్టారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి కాలనీ అభివృద్ధికి పాటుపడదామని వక్తలు ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడతాయని కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనరసింహలు, శ్రావణ్, శ్రీకాంత్, బద్రి, నరేంద్ర, సతీష్, పవన్, ఓం శేఖర్, నవీన్, భార్గవ్, నవీన్ కుమార్,మధు,వంశీ,కదరయ్య, కాటమయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
    user_Thiruveedhula Rameshnaidu
    Thiruveedhula Rameshnaidu
    Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అనంతపురం జిల్లాలో గత 20 రోజుల నుండి రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ,ఆపరేషన్ నైట్ సేఫ్టీ అంటూ రోడ్డు పై స్టంట్స్ చేస్తున్న వారిని పట్టుకొని,బండి సీజ్ చేసి,వారి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా
    1
    అనంతపురం జిల్లాలో గత 20 రోజుల నుండి రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ,ఆపరేషన్ నైట్ సేఫ్టీ అంటూ రోడ్డు పై స్టంట్స్ చేస్తున్న వారిని పట్టుకొని,బండి సీజ్ చేసి,వారి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ  ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*
కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    13 hrs ago
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆనందంతో జీవించాలని దశ మహా విద్యల పేరుతో పది రోజులపాటు హోమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో 20వ తేదీ వరకు హోమాలు జరుగుతాయన్నారు. నాలుగవ రోజు మంగళవారం భువనేశ్వరి దేవి హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
    1
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆనందంతో జీవించాలని దశ మహా విద్యల పేరుతో పది రోజులపాటు హోమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో 20వ తేదీ వరకు హోమాలు జరుగుతాయన్నారు. నాలుగవ రోజు మంగళవారం భువనేశ్వరి దేవి హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.
    1
    అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి.
చెన్నూరు మహమ్మద్ అబ్బాస్
కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.
    user_CHENNURU MAHAMMAD ABBAS
    CHENNURU MAHAMMAD ABBAS
    Lawyer ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Nageshwari Nageshwari
    4
    Post by Nageshwari Nageshwari
    user_Nageshwari Nageshwari
    Nageshwari Nageshwari
    Farmer బి.కొత్తకోట, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Palakattu nagendra
    1
    Post by Palakattu nagendra
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పుట్టపర్తి, ఏప్రిల్ 14: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళి నాయక్ త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్. శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. గోరంట్ల మండలం,కల్లితాండాలో నిర్వహించిన మురళి నాయక్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణం.వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తిని యువత కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో గోరంట్ల తహసీల్దార్ మధు నాయక్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అశ్రునివాలర్పించారు.
    2
    పుట్టపర్తి, ఏప్రిల్ 14:
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళి నాయక్ త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్. శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. గోరంట్ల మండలం,కల్లితాండాలో నిర్వహించిన మురళి నాయక్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణం.వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తిని యువత కొనసాగించాలి.
ఈ కార్యక్రమంలో గోరంట్ల తహసీల్దార్ మధు నాయక్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అశ్రునివాలర్పించారు.
    user_Thiruveedhula Rameshnaidu
    Thiruveedhula Rameshnaidu
    Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.