ఉమామహల్ సినీ మెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ . పాతపట్నం లో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉమామహల్ సినీ మెక్స్ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వినోద రంగ అభివృద్ధి ద్వారా స్థానిక వాణిజ్యం బలపడుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఉమామహల్ సినీ మెక్స్ ప్రారంభంతో నియోజకవర్గ ప్రజలకు కుటుంబ సమేతంగా నాణ్యమైన వినోదం అందుబాటులోకి రావడం ఆనందకరమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగర స్థాయి సౌకర్యాలు అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పాతపట్నాన్ని "కొత్తపట్నం"గా తీర్చిదిద్దే దిశగా ఈ సినీ మెక్స్ మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సినిమా హాల్ నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఉమామహల్ సినీ మెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ . పాతపట్నం లో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉమామహల్ సినీ మెక్స్ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ
లక్ష్యమని తెలిపారు. వినోద రంగ అభివృద్ధి ద్వారా స్థానిక వాణిజ్యం బలపడుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఉమామహల్ సినీ మెక్స్ ప్రారంభంతో నియోజకవర్గ ప్రజలకు కుటుంబ సమేతంగా నాణ్యమైన వినోదం అందుబాటులోకి రావడం ఆనందకరమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగర
స్థాయి సౌకర్యాలు అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పాతపట్నాన్ని "కొత్తపట్నం"గా తీర్చిదిద్దే దిశగా ఈ సినీ మెక్స్ మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సినిమా హాల్ నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.1
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- 🙏🙏1
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.1