ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలి.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుంది విద్యార్థినులకు డీఎస్పీ పిలుపు పిఠాపురం,ఏప్రిల్ 20 :స్థానిక డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థినుల భద్రత, రక్షణ భవిష్యత్తు నిర్మాణంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఇన్‌చార్జ్ ఎస్‌బీ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోవాలని కోరారు. పాఠశాల, ఇల్లు, ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో 181, 112, 1091 హెల్ప్‌లైన్ నంబర్లను ధైర్యంగా వినియోగించాలని సూచించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మాణికుమార్ లు మాట్లాడుతూ.. సోషల్ మీడియా వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలి.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుంది విద్యార్థినులకు డీఎస్పీ పిలుపు పిఠాపురం,ఏప్రిల్ 20 :స్థానిక డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థినుల భద్రత, రక్షణ భవిష్యత్తు నిర్మాణంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాకినాడ ఇన్‌చార్జ్ ఎస్‌బీ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తమ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోవాలని
కోరారు. పాఠశాల, ఇల్లు, ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో 181, 112, 1091 హెల్ప్‌లైన్ నంబర్లను ధైర్యంగా వినియోగించాలని సూచించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మాణికుమార్ లు మాట్లాడుతూ.. సోషల్ మీడియా వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్
నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- Post by Ramprasad islavath1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1