logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉన్నతి విద్యా ప్లస్ లో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ ఆసిఫాబాద్ అక్షిత ప్రతినిధి ఉన్నతి విద్యా ప్లస్ లో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో తిర్యాణి, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధనా ప్రతిభ, విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న విధానం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మరింత మెరుగైన రీతిలో, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా పద్ధతులను అవలంబించాలని తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల బోధనను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనా సహాయక వ్యవస్థను వినియోగించి పాఠ్యాంశాల సారాంశం, విద్యార్థుల సందేహాల నివృత్తి, సంబంధిత వీడియోలు, సిమ్యులేషన్లను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులలో ఆసక్తి, అవగాహన పెరుగుతాయని తెలిపారు. ఉన్నతి విద్యా ప్లస్ ద్వారా పాఠశాలలలో బోధనా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మరింత పెంపొందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు బోధన సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిశీలించి, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Ramesh Solanki
Ramesh Solanki
स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
1 hr ago
71c41480-6a31-44e0-bc1d-a6fece71ff74

ఉన్నతి విద్యా ప్లస్ లో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ ఆసిఫాబాద్ అక్షిత ప్రతినిధి ఉన్నతి విద్యా ప్లస్ లో అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో తిర్యాణి, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధనా ప్రతిభ, విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న విధానం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మరింత మెరుగైన రీతిలో, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా పద్ధతులను అవలంబించాలని తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల బోధనను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనా సహాయక వ్యవస్థను వినియోగించి పాఠ్యాంశాల సారాంశం, విద్యార్థుల సందేహాల నివృత్తి, సంబంధిత వీడియోలు, సిమ్యులేషన్లను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులలో ఆసక్తి, అవగాహన పెరుగుతాయని తెలిపారు. ఉన్నతి విద్యా ప్లస్ ద్వారా పాఠశాలలలో బోధనా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మరింత పెంపొందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు బోధన సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిశీలించి, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    7 hrs ago
  • బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు  కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి 
విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు  సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    18 min ago
  • ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్
కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు
ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల  పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని 
మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన  కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    1
    శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.