ఇంస్టాగ్రాంలో పరిచయం పెంచుకొని ప్రేమ, పెళ్ళి పేరుతో 16ఏళ్ళ బాలికను మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన ఇంస్టాగ్రాంలో పరిచయం పెంచుకొని ప్రేమ, పెళ్ళి పేరుతో 16ఏళ్ళ బాలికను మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *10 నెలల కాలంలోనే నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని వారి భవిష్యత్తు మీద దృష్టి సారించి తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పే మోసగాళ్ళ మాటలునమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసు స్టేషనులో 2025 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన పంది నారాయణ (24 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 6,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని మార్చి 11న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. నెల్లిమర్ల మండలం, కొండవెలగాడ గ్రామానికి చెందిన పంది నారాయణ అదే గ్రామానికి చెందిన ఒక 16ఏళ్ళ మైనరు బాలికతో ఇంస్టాగ్రాంలో పరిచయం పెంచుకొని, సంవత్సరం నుండి ప్రేమిస్తున్నానని నమ్మించి, ఆ బాలికను అనేక సార్లు శారీరకంగా అనుభవించి మోసం చేసాడన్నారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో, అది గమనించిన బాలిక తల్లితండ్రులు ఈ విషయాన్ని గ్రామ పెద్దల వద్ద ప్రస్తావించగా నిందితుడు బాలికను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని, పెళ్లి చేసుకోకుండా దాటవేస్తు కాలయాపన చేసేవాడు. తేది 15.05.2025న కడుపునొప్పితో బాధపడగా ఆ బాలికకు అబార్షన్ అయిందని, వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు నెల్లిమర్ల పోలీసు స్టేషను ఎస్ఐ బి.గణేష్ తే.15.05.2025దిన పోక్సో కేసు నమోదు చేశారన్నారు. అనంతరం అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తి చేసేటట్లు పోలీసు మరియు జ్యుడిషియల్ అధికారులు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. నిందితుడు పంది నారాయణ (24 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ. 6,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎస్.రామమూర్తి నాయుడు వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు హెడ్ కానిస్టేబులు ఎ.మురళి, స్పెషల్ పిపి ఎస్.రామమూర్తి నాయుడులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. పోక్సో కేసులలో శిక్షలు పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రధమ స్థానంలో ఉందని, మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తీవ్రంగా హెచ్చరించారు. బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని వారి భవిష్యత్తు మీద దృష్టి సారించి తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పే మోసగాళ్ళ మాటలునమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు.

- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- డుంబ్రిగూడ మండలంలోని చాపరాయిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. డుంబ్రిగూడకు చెందిన రామారావు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా ఆటో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం అరకులోయ ఏరియా ఆసుపత్రికి అందించారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.4
- విజయనగరం జిల్లా రామభద్రపురంలోని టి.బి.ఆర్ థియేటర్ సమీపంలో బుధవారం బస్సు–లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి సహాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...2