logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ఆదివారం నుండి ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, వ్యాపారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రింది ప్రాంతాలలో గల రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు పశ్చిమ మండలంలో చుట్టుగుంట రైతు బజార్.గుంటూరు తూర్పు మండలంలో బస్ స్టాండ్ వద్ద గల రైతు బజార్.పొన్నూరు మండల కేంద్రం పొన్నూరు రైతు బజార్.తెనాలి మండల కేంద్రంలో జి.ఐ రైతు బజార్, మంగళగిరి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో గల రైతు బజార్.తాడికొండ మండల కేంద్రంలో శ్రీ రామ అప్పాజీ నిలయం, గాంధీ బొమ్మ సెంటర్.ప్రతిపాడు మండల కేంద్రంలో విజయ కృష్ణ జనరల్ స్టోర్స్ లో విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_Shaik Bassha
Shaik Bassha
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
49df4727-26ff-4a41-97ca-c96474ee5120

రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ఆదివారం నుండి ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, వ్యాపారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ

75169e87-9c8c-4cf6-af3c-6e3f859e903f

సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రింది ప్రాంతాలలో గల రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్ లెట్ స్టోర్ లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు పశ్చిమ మండలంలో చుట్టుగుంట రైతు బజార్.గుంటూరు తూర్పు మండలంలో బస్ స్టాండ్ వద్ద గల రైతు బజార్.పొన్నూరు మండల కేంద్రం పొన్నూరు రైతు బజార్.తెనాలి

2c704251-5103-4e8f-b945-af730d42ba5c

మండల కేంద్రంలో జి.ఐ రైతు బజార్, మంగళగిరి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో గల రైతు బజార్.తాడికొండ మండల కేంద్రంలో శ్రీ రామ అప్పాజీ నిలయం, గాంధీ బొమ్మ సెంటర్.ప్రతిపాడు మండల కేంద్రంలో విజయ కృష్ణ జనరల్ స్టోర్స్ లో విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    1
    ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది
ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    9 hrs ago
  • తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు...........
తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    3
    ఎన్టీఆర్ జిల్లా 

మైలవరం నియోజకవర్గం 

 మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు

 మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ...

 జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం

 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు....

 జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    1
    పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య.
పెదకూరపాడు : 
రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    2
    ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    12 hrs ago
  • బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    1
    బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు.
చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు.
జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    1
    GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ
రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.  ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    12 hrs ago
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    2
    భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక  44 అడుగులకు చేరిన గోదావరి వరద
భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.