*అచ్చంపేట నుండి రాయవరం గ్రామం మీదుగా కొల్లాపూర్ కు బస్సు నడపాలని డిఎంకు వినతి పత్రం* అచ్చంపేట, ఫిబ్రవరి 18(షురూ ఆప్ న్యూస్ ) : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గ కేంద్రం నుండి లింగాల, దారారం క్యాంప్ రాయవరం, రాయవరం, వడ్డె రాయవరం, యాపట్ల మీదుగా కొల్లాపూర్‌కు బస్సు నడపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం రోజు అచ్చంపేట డిఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పినప్పుడు బస్సు ఆ గ్రామాల మీదకు వెళ్ళింది పది రోజులకు బందు చేశారు. తదనంతరం ఆ గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనంలో ఎక్కి రావాలంటే ఒక్కొక్క వాహనంతో చార్జీలు విపరీతంగా తీసుకుంటూ సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల మీదుగా బస్సు నడిపించాలని డిఎంను కోరారు. దారారం గ్రామ సర్పంచ్, క్యాంపు రాయవరం సర్పంచ్ ,రాయవరం సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాల సేకరణ చేసి డిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ గ్రామాల మీదుగా కొల్లాపూర్ వరకు బస్సు నడపకపోతే గ్రామ ప్రజలచే ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు అన్నారు. సిపిఎం మండల నాయకులు పిట్టల స్వామి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
*అచ్చంపేట నుండి రాయవరం గ్రామం మీదుగా కొల్లాపూర్ కు బస్సు నడపాలని డిఎంకు వినతి పత్రం* అచ్చంపేట, ఫిబ్రవరి 18(షురూ ఆప్ న్యూస్ ) : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గ కేంద్రం నుండి లింగాల, దారారం క్యాంప్ రాయవరం, రాయవరం, వడ్డె రాయవరం, యాపట్ల మీదుగా కొల్లాపూర్‌కు బస్సు నడపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం రోజు అచ్చంపేట డిఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పినప్పుడు బస్సు ఆ గ్రామాల మీదకు వెళ్ళింది పది రోజులకు బందు చేశారు. తదనంతరం ఆ గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనంలో ఎక్కి రావాలంటే ఒక్కొక్క వాహనంతో చార్జీలు విపరీతంగా తీసుకుంటూ సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల మీదుగా బస్సు నడిపించాలని డిఎంను కోరారు. దారారం గ్రామ సర్పంచ్, క్యాంపు రాయవరం సర్పంచ్ ,రాయవరం సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాల సేకరణ చేసి డిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ గ్రామాల మీదుగా కొల్లాపూర్ వరకు బస్సు నడపకపోతే గ్రామ ప్రజలచే ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు అన్నారు. సిపిఎం మండల నాయకులు పిట్టల స్వామి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు అనుమతి లేకుండా జేసీబీతో చెట్లు తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వనాన్ని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపారని తెలిపారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.1