టీడీఆర్ బాండ్లు వద్దంటే.. భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే. టీడీఆర్ బాండ్లు వద్దంటే.. భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే. *బాండ్లు తీసుకోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదన్న హైకోర్టు* రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం భూములు సేకరించే క్రమంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు (టీడీఆర్- బదిలీకి వీలున్న హక్కుపత్రాలు) తీసుకోవాలని భూయజమానులను ఒత్తిడి చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి ఆస్తి హక్కుదారులు,భూయజమానులు నిరాకరించినప్పుడు భూసేకరణ చట్టం-2013 ప్రకారం వారికి పరిహారం చెల్లించడమే అధికారుల ముందున్న ఏకైక మార్గమని తేల్చిచెప్పింది. బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదని, అది ఐచ్ఛికం మాత్రమేనని తెలిపింది. ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన టీడీఆర్ బాండ్లను తీసుకునేందుకు పిటిషనర్లు నిరాకరించడంతో మార్కెట్ ధరను మదింపు చేసి భూసేకరణ చట్ట నిబంధనలను అనుసరించి పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణ కోసం తమ స్థలాలు తీసుకుంటున్నందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ కె.సుస్మిత్ కుమార్, మరి కొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. తమకు బాండ్లు వద్దని, భూసేకరణ చట్టప్రకారం పరి హారం ఇప్పించాలని కోరారు. పిటిషనర్ల తరపున షేక్ ఆసిఫ్ వాదనలు వినిపించారు. బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇళ్లు కూల్చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి. భూయజమానులు టీడీఆర్ బాండ్లను స్వచ్ఛందంగా అంగీకరిస్తే పర్వాలేదు గానీ, వాటిని అంగీకరించడం తప్పనిసరి కాదన్నారు. భూసేకరణ చట్ట నిబంధనలను అనుసరించి పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

- Post by దాసరి ప్రేమ్1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- Post by V Ramarao3
- Post by Bondhu Suresh1
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1