logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలాసలో ఏప్రిల్ కు ఆర్వోబీ, జూన్ నుండి కేంద్రీయ విద్యాలయ తరగతులు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫిబ్రవరి 17 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం 9 గంటలకు పలాస చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత రైల్వే స్టేషన్ సమీపంలోని పై వంతెన పనులను సమీక్షించారు. ప్రాజెక్ట్ రిపోర్టును పరిశీలించి.. ప్రస్తుత స్థితిని ఆరా తీశారు. పనుల్లో ఆలస్యం జరుగుతోందని, రేయింబవళ్ళు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని అదేశించారు. రైల్వే వంతెన తో పాటు ఆనుకుని సర్వీసు రోడ్డు పనులు కూడా వేగంగా జరపాలని తెలిపారు. అనంతరం అక్కడి నుండి పలాస లోని నెమలికొండ ప్రాంతాలలో త్వరలో నిర్మాణం జరగనున్న కేంద్రీయ విద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలు నిర్మాణం జరిగే తీరును ప్రాజెక్టు రిపోర్టు ద్వారా కేంద్ర మంత్రికి కలెక్టర్, ఆర్డీవో వివరించారు. పాఠశాలకు అనుసంధానం అయ్యే రోడ్లు, ఇతర మౌలిక వసతులను ఆరా తీశారు. అక్కడి నుండి పలాస పట్టణంలోని రైల్వే కాలనీలో బారక్ భవనాలను పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరం తరగతులను ఈ భవనాలు నుండి జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో రైల్వే అధికారులతో గదుల అప్పగింతపై అనుమతుల సమస్యను పరిష్కరించారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ఏడాది తరగతులు పక్కగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. పలాస పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల అయిన, పలాస ROB ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. భారతీయ రైల్వే మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ROB పూర్తి అయితే పలాస పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని అన్నారు. అలాగే పలాస లో ఏర్పాటు కానున్న కేంద్రియ విద్యాలయానికి తాజా వివరాలను వెల్లడించారు. రాబోయే విద్యాసంవత్సరం నుండే తరగతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి బారెక్ భవనాలకు సంబంధించిన అనుమతుల సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సాయుధ దళాల సిబ్బంది, కేంద్ర సంస్థల ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశాలు లభిస్తాయనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, రెవెన్యూ, రైల్వే అధికారులు స్థానికులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago
faeb652d-3011-4fe4-99e3-c256ef899b41

పలాసలో ఏప్రిల్ కు ఆర్వోబీ, జూన్ నుండి కేంద్రీయ విద్యాలయ తరగతులు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫిబ్రవరి 17 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం 9 గంటలకు పలాస చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత రైల్వే స్టేషన్ సమీపంలోని పై వంతెన పనులను సమీక్షించారు. ప్రాజెక్ట్ రిపోర్టును పరిశీలించి.. ప్రస్తుత స్థితిని ఆరా తీశారు. పనుల్లో ఆలస్యం జరుగుతోందని, రేయింబవళ్ళు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని అదేశించారు. రైల్వే

f69e471d-3fc0-4530-be67-2658aaf08205

వంతెన తో పాటు ఆనుకుని సర్వీసు రోడ్డు పనులు కూడా వేగంగా జరపాలని తెలిపారు. అనంతరం అక్కడి నుండి పలాస లోని నెమలికొండ ప్రాంతాలలో త్వరలో నిర్మాణం జరగనున్న కేంద్రీయ విద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాలు నిర్మాణం జరిగే తీరును ప్రాజెక్టు రిపోర్టు ద్వారా కేంద్ర మంత్రికి కలెక్టర్, ఆర్డీవో వివరించారు. పాఠశాలకు అనుసంధానం అయ్యే రోడ్లు, ఇతర మౌలిక వసతులను ఆరా తీశారు. అక్కడి నుండి పలాస పట్టణంలోని రైల్వే కాలనీలో బారక్ భవనాలను పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరం తరగతులను ఈ భవనాలు నుండి జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో రైల్వే అధికారులతో గదుల అప్పగింతపై అనుమతుల

2c3f4fd3-ee48-4320-ac3f-961c8a5e6d0a

సమస్యను పరిష్కరించారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ఏడాది తరగతులు పక్కగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. పలాస పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల అయిన, పలాస ROB ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. భారతీయ రైల్వే మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ

50127ba3-b54c-4baf-8ba3-baf4f46c396e

ROB పూర్తి అయితే పలాస పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని అన్నారు. అలాగే పలాస లో ఏర్పాటు కానున్న కేంద్రియ విద్యాలయానికి తాజా వివరాలను వెల్లడించారు. రాబోయే విద్యాసంవత్సరం నుండే తరగతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి బారెక్ భవనాలకు సంబంధించిన అనుమతుల సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సాయుధ దళాల సిబ్బంది, కేంద్ర సంస్థల ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశాలు లభిస్తాయనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, రెవెన్యూ, రైల్వే అధికారులు స్థానికులు పాల్గొన్నారు.

More news from Parvathipuram Manyam and nearby areas
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    4 hrs ago
  • సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    4
    సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    1
    పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు  వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    1
    చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత
ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    1
    కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    1
    జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    20 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.