అచ్చంపేటలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం అచ్చంపేట, మార్చి 10(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న పథకాలలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రత్యేక గుర్తు (లోగో)ను రూపొందించినట్లు స్థానిక నాయకులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, డా. చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” పేరిట చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని మూడో వార్డులో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. హిందూ శ్మశానవాటికలో పెరిగిన తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపాలిటీ కమిషనర్ మురళి ఆధ్వర్యంలో చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు శ్మశానవాటికను శుభ్రంగా ఉంచాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్‌కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3