మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహానికి 20 ఎకరాల స్థల పరిశీలన 200కోట్ల రూపాయల తో శ్రీ సంత్ సేవాలాల్, విగ్రహం ఆశ్రమం నిర్మాణం టీ పీ సీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు. వంశీ కృష్ణ అచ్చంపేట, ఫిబ్రవరి 17,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని పదర మండలం మద్ది మడుగు గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణతో పాటుఉన్నతాధికారుల సందర్శనం మద్దిమడుగు గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల భూస్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ తో కలిసి మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆలయ–విగ్రహ సముదాయానికి సంబంధించి నిర్వహించిన ఈ పరిశీలనలో తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్, ఆర్ & బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నల్లమల అభివృద్ధి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ, నల్లమల ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ద్వారా అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. నల్లమల ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మద్దిమడుగులో ప్రతిపాదిత 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నమూనాలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు సహా అన్ని వర్గాల ప్రజల సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదం కలుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో నల్లమల టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహానికి 20 ఎకరాల స్థల పరిశీలన 200కోట్ల రూపాయల తో శ్రీ సంత్ సేవాలాల్, విగ్రహం ఆశ్రమం నిర్మాణం టీ పీ సీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు. వంశీ కృష్ణ అచ్చంపేట, ఫిబ్రవరి 17,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని పదర మండలం మద్ది మడుగు గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణతో పాటుఉన్నతాధికారుల సందర్శనం మద్దిమడుగు గ్రామంలో బంజారాల
ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల భూస్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ తో కలిసి మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆలయ–విగ్రహ సముదాయానికి సంబంధించి నిర్వహించిన ఈ పరిశీలనలో తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్, ఆర్ & బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్,
ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నల్లమల అభివృద్ధి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ, నల్లమల ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ద్వారా అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. నల్లమల ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మద్దిమడుగులో ప్రతిపాదిత
20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నమూనాలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు సహా అన్ని వర్గాల ప్రజల సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదం కలుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో నల్లమల టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.1
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.1
- కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.1
- *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బడంగ్ పేట్ సర్కిల్* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...* మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు1