logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కట్టరాంపూర్ వాసులకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ వదలడంతో పాటు, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. రహదారిపై మురుగునీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కట్టరాంపూర్ ప్రజలు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

15 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
15 hrs ago
176d2b77-29fd-4c8a-9e92-ad7b29438a5b

కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కట్టరాంపూర్ వాసులకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో గ్యాప్ వదలడంతో పాటు, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్డుపైకి చేరింది. రహదారిపై మురుగునీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కట్టరాంపూర్ ప్రజలు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రెడ్ స్ప్రైట్స్ అనేవి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ల సమయంలో మేఘాల పైన, భూమికి సుమారు 50 నుండి 90 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే అరుదైన విద్యుత్ కాంతి దృశ్యాలు. భూమిపై పిడుగు పడినప్పుడు విడుదలయ్యే శక్తివంతమైన విద్యుత్ తరంగాలు పై వాతావరణంలో ఉన్న నైట్రోజన్ అణువులను ఉత్తేజితం చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల నైట్రోజన్ అణువులు ఎర్రటి కాంతిని వెదజల్లుతూ 'జెల్లీఫిష్' లేదా 'క్యారెట్' ఆకారంలో కనిపిస్తాయి. అయితే, ఇవి సాధారణంగా కొన్ని మిల్లీసెకన్ల పాటు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి కంటితో చూడటం చాలా కష్టం. ఇటీవల టిబెట్ ఆకాశంలో ఈ 'రెడ్ స్ప్రైట్స్' కనిపించాయి.
    1
    రెడ్ స్ప్రైట్స్ అనేవి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ల సమయంలో మేఘాల పైన, భూమికి సుమారు 50 నుండి 90 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే అరుదైన విద్యుత్ కాంతి దృశ్యాలు.

భూమిపై పిడుగు పడినప్పుడు విడుదలయ్యే శక్తివంతమైన విద్యుత్ తరంగాలు పై వాతావరణంలో ఉన్న నైట్రోజన్ అణువులను ఉత్తేజితం చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల నైట్రోజన్ అణువులు ఎర్రటి కాంతిని వెదజల్లుతూ 'జెల్లీఫిష్' లేదా 'క్యారెట్' ఆకారంలో కనిపిస్తాయి. అయితే, ఇవి సాధారణంగా కొన్ని మిల్లీసెకన్ల పాటు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి కంటితో చూడటం చాలా కష్టం.

ఇటీవల టిబెట్ ఆకాశంలో ఈ 'రెడ్ స్ప్రైట్స్' కనిపించాయి.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
  • జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ ప్రజలు గురువారం పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేసి, పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాన్కూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంత నీలగిరి ప్లాంటేషన్‌లో జరిగిన ఈ సదస్సులో, అధికారులు అడవుల ప్రాముఖ్యతను వివరించారు. అడవుల్లో సంచరించే వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని, వాటిని వేటాడటం చట్టరీత్యా నేరమని వారు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్, ఈ-వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ సాగరిక, కార్యదర్శి శ్రావణ్ గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్, ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్ (మంచిర్యాల రేంజ్), జలపతి (బెల్లంపల్లి రేంజ్), లక్ష్మణ్ (కాగజ్‌నగర్ రేంజ్), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రేగుంట చందు, టీజీ ఎఫ్‌డీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ ప్రజలు గురువారం పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేసి, పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కాన్కూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంత నీలగిరి ప్లాంటేషన్‌లో జరిగిన ఈ సదస్సులో, అధికారులు అడవుల ప్రాముఖ్యతను వివరించారు. అడవుల్లో సంచరించే వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని, వాటిని వేటాడటం చట్టరీత్యా నేరమని వారు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్, ఈ-వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ సాగరిక, కార్యదర్శి శ్రావణ్ గ్రామస్తులను కోరారు.

ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్, ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్ (మంచిర్యాల రేంజ్), జలపతి (బెల్లంపల్లి రేంజ్), లక్ష్మణ్ (కాగజ్‌నగర్ రేంజ్), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రేగుంట చందు, టీజీ ఎఫ్‌డీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్ మండలం పరిధిలో ఉన్న తుమ్మలు బ్రిడ్జి గతంలో దానిపై నుండి వెళ్ళిన వాహనాల కారణంగా మరమ్మతులకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పక్కల ఏ క్షణానైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్ మండలం పరిధిలో ఉన్న తుమ్మలు బ్రిడ్జి గతంలో దానిపై నుండి వెళ్ళిన వాహనాల కారణంగా మరమ్మతులకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పక్కల ఏ క్షణానైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • లక్షెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం చెరువు వద్ద ప్రస్తుతం చేపల కోసం సందడి నెలకొంది. రానున్న మూడు రోజుల్లో మృగశిర కార్తె రానున్న నేపథ్యంలో, గురువారం వివిధ ప్రాంతాల నుండి చేపల విక్రయ నిర్వాహకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొమ్ముగూడెం చెరువు వద్దకు చేరుకున్నారు. వచ్చిన వారంతా అక్కడ నిర్వాహకులతో సంభాషించి, వారికి అవసరమైన చేపలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రాకముందు కొమ్ముగూడెం చెరువు వద్ద భారీ మొత్తంలో చేపలను కొనుగోలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఈ సంవత్సరం కూడా ప్రజలు చేపల కొనుగోలుకు తరలివచ్చారు.
    1
    లక్షెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం చెరువు వద్ద ప్రస్తుతం చేపల కోసం సందడి నెలకొంది. రానున్న మూడు రోజుల్లో మృగశిర కార్తె రానున్న నేపథ్యంలో, గురువారం వివిధ ప్రాంతాల నుండి చేపల విక్రయ నిర్వాహకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కొమ్ముగూడెం చెరువు వద్దకు చేరుకున్నారు.

వచ్చిన వారంతా అక్కడ నిర్వాహకులతో సంభాషించి, వారికి అవసరమైన చేపలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రాకముందు కొమ్ముగూడెం చెరువు వద్ద భారీ మొత్తంలో చేపలను కొనుగోలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఈ సంవత్సరం కూడా ప్రజలు చేపల కొనుగోలుకు తరలివచ్చారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం (04.06.2026) కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు (MEOs), కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేస్తూ ప్రవేశాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ NV గిరి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం (04.06.2026) కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు (MEOs), కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేస్తూ ప్రవేశాల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రవేశాల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ NV గిరి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని తామే కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరించి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగానే ఎన్.హెచ్-563 మంజూరైందని, అప్పుడే టెండర్లు కూడా పూర్తయ్యాయని గుర్తుచేశారు. గతంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు జరిగాయని, కరీంనగర్-వరంగల్ మధ్య పనులు 60 శాతం పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే మంజూరైన పనులను తామే కొత్తగా తీసుకొచ్చినట్లుగా బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సుంకే రవిశంకర్ మండిపడ్డారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా, పదే పదే పనులు ప్రారంభించామని ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఈ మోసపూరిత ప్రకటనలను గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి పొందడం తగదని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.
    1
    చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని తామే కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరించి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగానే ఎన్.హెచ్-563 మంజూరైందని, అప్పుడే టెండర్లు కూడా పూర్తయ్యాయని గుర్తుచేశారు. గతంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు జరిగాయని, కరీంనగర్-వరంగల్ మధ్య పనులు 60 శాతం పూర్తయ్యాయని వివరించారు.

ఇప్పటికే మంజూరైన పనులను తామే కొత్తగా తీసుకొచ్చినట్లుగా బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సుంకే రవిశంకర్ మండిపడ్డారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా, పదే పదే పనులు ప్రారంభించామని ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఈ మోసపూరిత ప్రకటనలను గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి పొందడం తగదని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    19 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోహిణి కార్తిలో గత 15 రోజులుగా 45 నుండి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు తొలకరి వర్షం ఉపశమనం కలిగించింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, వేసవి తాపం నుండి ప్రజలకు ఊరట లభించింది. నేడు మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన జనం వర్షంలో తడుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, వానకాలం పంటల కోసం ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న రైతులు, సరైన సమయానికి వర్షం కురవడంతో తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    4
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోహిణి కార్తిలో గత 15 రోజులుగా 45 నుండి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు తొలకరి వర్షం ఉపశమనం కలిగించింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, వేసవి తాపం నుండి ప్రజలకు ఊరట లభించింది.

నేడు మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన జనం వర్షంలో తడుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, వానకాలం పంటల కోసం ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న రైతులు, సరైన సమయానికి వర్షం కురవడంతో తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేటీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సింగరేణి కార్మికులను, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాన్ని మానుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మతితో మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని వంశీకృష్ణ ఆరోపించారు. "ఖబర్దార్ కేటీఆర్" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించిన ఎంపీ వంశీకృష్ణ, కేటీఆర్ చిల్లర చేష్టల వల్ల సింగరేణి కార్మికుడికి గానీ, తెలంగాణ ప్రజలకు గానీ ఏ ఒక్కరికైనా హాని జరిగితే ఊరుకునేది లేదని, పిచ్చి కొట్టుడు కొడతామని స్పష్టం చేశారు. పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది కేటీఆర్ గారేనని, ముఖ్యమంత్రి ఆయన సొంత నాయనేనని గుర్తు చేస్తూ, సింగరేణి కష్టాలను గత పది సంవత్సరాలుగా కళ్ళారా చూడలేదా అని ప్రశ్నించారు. పది మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంట్‌లో ఏమి పీకిండ్రు అని ఈరోజు తాను సవాల్ విసురుతున్నానని ఆయన తీవ్రంగా నిలదీశారు. కేవలం గాలి మాటలు చెప్పి యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దని వంశీకృష్ణ సూచించారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి, పార్లమెంట్‌లో ఎంపీలు ఉన్నప్పటికీ, సింగరేణి కోసం ఒక్కరు కూడా ఎందుకు గళం విప్పలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి వెనక తోక జాడుకొని ఎందుకు పోయిండ్రు అని నిలదీస్తూ, దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
    1
    పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేటీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సింగరేణి కార్మికులను, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాన్ని మానుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మతితో మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని వంశీకృష్ణ ఆరోపించారు.

"ఖబర్దార్ కేటీఆర్" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించిన ఎంపీ వంశీకృష్ణ, కేటీఆర్ చిల్లర చేష్టల వల్ల సింగరేణి కార్మికుడికి గానీ, తెలంగాణ ప్రజలకు గానీ ఏ ఒక్కరికైనా హాని జరిగితే ఊరుకునేది లేదని, పిచ్చి కొట్టుడు కొడతామని స్పష్టం చేశారు. పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది కేటీఆర్ గారేనని, ముఖ్యమంత్రి ఆయన సొంత నాయనేనని గుర్తు చేస్తూ, సింగరేణి కష్టాలను గత పది సంవత్సరాలుగా కళ్ళారా చూడలేదా అని ప్రశ్నించారు. పది మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంట్‌లో ఏమి పీకిండ్రు అని ఈరోజు తాను సవాల్ విసురుతున్నానని ఆయన తీవ్రంగా నిలదీశారు.

కేవలం గాలి మాటలు చెప్పి యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దని వంశీకృష్ణ సూచించారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి, పార్లమెంట్‌లో ఎంపీలు ఉన్నప్పటికీ, సింగరేణి కోసం ఒక్కరు కూడా ఎందుకు గళం విప్పలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి వెనక తోక జాడుకొని ఎందుకు పోయిండ్రు అని నిలదీస్తూ, దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులలో అధికారుల నిర్లక్ష్యం కట్టరాంపూర్ నివాసితులకు తీవ్ర శాపంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో అంతరం ఏర్పడగా, డ్రైనేజీ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. దీని ఫలితంగా మురుగునీరంతా రోడ్డుపైకి చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి మురుగు కాలువ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    1
    కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులలో అధికారుల నిర్లక్ష్యం కట్టరాంపూర్ నివాసితులకు తీవ్ర శాపంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో అంతరం ఏర్పడగా, డ్రైనేజీ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

దీని ఫలితంగా మురుగునీరంతా రోడ్డుపైకి చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి మురుగు కాలువ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.