logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ అక్షర గ్రామర్ స్కూల్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల ఎక్స్‌ రోడ్డు వద్ద గల శ్రీ అక్షర గ్రామర్ స్కూల్‌లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.నిమజ్జన కార్యక్రమానికి ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. విద్యార్థులు భక్తిగీతాలు ఆలపిస్తూ, గణనాథుని నామస్మరణతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రహ్లాద్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వంటి పండుగలు విద్యార్థుల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు పండుగల విశిష్టతను తెలుసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ఉత్సవాలను విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బందికి పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, కృష్ణయ్య, రాధా, సువర్ణ, అస్మిత, కృష్ణమ్మ, మనీషా, కవిత, షాజిదా, సిబ్బంది జావిద్, సత్తయ్య, అర్చన, చెన్నమ్మతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, కృష్ణయ్య, భీమయ్య, హనుమంతు తదితరులు, స్థానికులు పాల్గొన్నారు.

14 hrs ago
user_J.rr
J.rr
మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
14 hrs ago
d2a06cf9-4965-4d2e-857a-3870ee9c1f9c

శ్రీ అక్షర గ్రామర్ స్కూల్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల ఎక్స్‌ రోడ్డు వద్ద గల శ్రీ అక్షర గ్రామర్ స్కూల్‌లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.నిమజ్జన కార్యక్రమానికి ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. విద్యార్థులు భక్తిగీతాలు ఆలపిస్తూ, గణనాథుని నామస్మరణతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా

65785e4e-79e8-4174-bf39-2eef3f17af79

పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రహ్లాద్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వంటి పండుగలు విద్యార్థుల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు పండుగల విశిష్టతను తెలుసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ఉత్సవాలను విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బందికి పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, కృష్ణయ్య, రాధా, సువర్ణ, అస్మిత, కృష్ణమ్మ, మనీషా, కవిత, షాజిదా, సిబ్బంది జావిద్, సత్తయ్య, అర్చన, చెన్నమ్మతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, కృష్ణయ్య, భీమయ్య, హనుమంతు తదితరులు, స్థానికులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.
    1
    సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల  ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • బీసీ రాజ్యాధికార ఉద్యమంపై తీన్మార్ మల్లన్న మనసులో మాట... *బీసీ రాజ్యాధికార యాత్ర*🚶‍♂️‍➡️ *సెప్టెంబర్ - 17*💥 *గోల్కొండ కోట - 8:00 AM*🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna #1yearfortrp
    1
    బీసీ రాజ్యాధికార ఉద్యమంపై తీన్మార్ మల్లన్న మనసులో మాట...

*బీసీ రాజ్యాధికార యాత్ర*🚶‍♂️‍➡️
*సెప్టెంబర్ - 17*💥
*గోల్కొండ కోట - 8:00 AM*🚩
#bcrajyadhikarayathra #trp #teenmarmallanna #1yearfortrp
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    10 hrs ago
  • రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది
    1
    రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    14 hrs ago
  • బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    1
    బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం
గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ /
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు
    1
    విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు
విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు
    user_Reporter MD khaleel
    Reporter MD khaleel
    Local News Reporter జహీరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం
శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    13 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే *బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. *మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ... *కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...* *50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* *మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* .. *ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్. 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు? అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం. ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.
    4
    మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే
*బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. 
*మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ...
*కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...*
*50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* 
*మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* ..
*ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* 
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్.
50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి.
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి.
ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... 
మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు?
అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం.
ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? 
గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు.
రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి.
ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి.
అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి.
సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు.
కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    15 hrs ago
  • సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    4
    సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం 
విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    17 hrs ago
  • రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం 
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.