ఇండ్ల గణన పక్కాగా నిర్వహించాలి జనాభా గణన 2027లో భాగంగా మొదట ఈ ఏడాది ఇండ్ల గణనను పక్కాగా చేపట్టాలని డీసీఓ (డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్) భారతీ హోళికేరి స్పష్టం చేశారు. జనగణనకు సంబంధించిన ప్రాథమిక కార్యకలాపాలపై సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ రూపకల్పన, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జనగణన విజయవంతంగా నిర్వహించాలంటే ప్రాథమిక స్థాయిలో చేపట్టే పనులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ విషయంలో సరైన రూపకల్పన, ఫీల్డ్ వెరిఫికేషన్, సిబ్బందికి సమానమైన వర్క్‌లోడ్ పంపిణీ జరగకపోతే క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.రక్షణ సంస్థలు, సున్నిత ప్రాంతాలు, జాతీయ ఆస్తులకు చెందిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటిని సాధారణ జనగణన ప్రాంతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. హెచ్‌ఎల్‌బీ అనేది జనగణనలో ఒక యూనిట్‌గా పనిచేస్తుందని వివరించారు. ప్రతి హెచ్‌ఎల్‌బీకి సుమారు 750–800 జనాభా ఉండేలా చూడాలన్నారు. 2011 తర్వాత భారీ మార్పులు జరిగిన నేపథ్యంలోకొత్త లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు, జనాభా పెరుగుదల ఇవన్నీ పరిగణలోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలన తప్పనిసరి అని తెలిపారు. ఎన్యుమరేటర్లలో ఒకరికి తక్కువ పని, మరొకరికి ఎక్కువ పని ఉండకుండాసమానంగా బాధ్యతలు కేటాయించాలని సూచించారు. చార్జ్ అధికారులు, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. జనగణన అనేది ఒక జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. గద్వాల ఐడిఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సెన్సెస్ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సిపిఓ పాపయ్య, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.1
- ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.2
- జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.1
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల పంపిణీ ఘనంగా 🔴 సోగనూరు రోడ్‌లో 1008 ఇళ్లను లబ్ధిదారులకు అందజేత 🔴 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు 🔴 పేదల సొంతింటి కలలు నిజం అవుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్య 🔴 త్వరలో కమ్యూనిటీ కాంప్లెక్స్, మార్కెట్, పార్కులు ఏర్పాటు 🔴 గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు 🔴 “మన ఇల్లు – మన గౌరవం” కార్యక్రమం శివన్న నగర్‌లో నిర్వహణ 🔴 650 మందికి రూ.2.50 లక్షల సబ్సిడీ పత్రాల పంపిణీ 🔴 గృహ నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల ప్రారంభం 🔴 లబ్ధిదారులకు సాంప్రదాయ వస్త్రాల అందజేత 🔴 అధికారులు, స్థానిక నాయకులు భారీగా హాజరు1