Shuru
Apke Nagar Ki App…
గజ్వేల్: నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేత గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు తూప్రాన్ రోడ్డులోని హెచ్పీ బంక్ వద్ద వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మనోహర్, ప్రకాశ్, సందీప్.. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారులు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
Ashok Kumar Potta
గజ్వేల్: నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేత గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు తూప్రాన్ రోడ్డులోని హెచ్పీ బంక్ వద్ద వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మనోహర్, ప్రకాశ్, సందీప్.. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారులు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏1
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును చేదించిన పోలీసులు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు గోపాల్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకున్నామని, చోరీ సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1