*జగిత్యాల జిల్లా* *ఆధ్యాత్మిక అభివృద్ధికి మరో ముందడుగు* *₹50 లక్షల CGF నిధులతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్* కథలాపూర్ ఆగస్టు 25 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ₹50 లక్షల CGF నిధులతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. సిరికొండ గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయ నిర్మాణంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి, ఆలయాల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
*జగిత్యాల జిల్లా* *ఆధ్యాత్మిక అభివృద్ధికి మరో ముందడుగు* *₹50 లక్షల CGF నిధులతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్* కథలాపూర్ ఆగస్టు 25 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ₹50 లక్షల CGF నిధులతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. సిరికొండ గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయ నిర్మాణంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి, ఆలయాల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు3
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.2
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1