logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ విధులకు ఆటంకం – పోలీసులపై దాడి బోధన్: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులు, పోలీసులపై కూడా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆగస్టు 21న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో జరిగింది. కోప్పర్గ గ్రామానికి చెందిన రమొల్ల సాయిలు, బండారు వినయ్ ఇద్దరు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడుతూ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు సమాచారం అందడంతో, రాత్రి బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, రోగులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినకుండా ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో పోలీసులతో గొడవపడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో సదరు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు.

1 day ago
user_Mirza Hassan Baig
Mirza Hassan Baig
Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
1 day ago

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ విధులకు ఆటంకం – పోలీసులపై దాడి బోధన్: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులు, పోలీసులపై కూడా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆగస్టు 21న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో జరిగింది. కోప్పర్గ గ్రామానికి చెందిన రమొల్ల సాయిలు, బండారు వినయ్ ఇద్దరు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడుతూ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు సమాచారం అందడంతో, రాత్రి బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, రోగులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినకుండా ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో పోలీసులతో గొడవపడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో సదరు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • *అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన* *జువ్వడి కృష్ణారావు* *మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్*
    1
    *అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన* 
*జువ్వడి కృష్ణారావు* *మున్సిపల్ చైర్ పర్సన్  తిరుమల వసంత గంగాధర్*
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • గుంతలు.. బురదతో ప్రజలకు అవస్థలు . గుడిహత్నూర్‌ మండలంలోని తోయగూడ గ్రామ రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలకు బురదమయంగా మారడంతో నడిచేందుకు కూడా వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులపై మొరం మట్టి పోసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
    1
    గుంతలు.. బురదతో ప్రజలకు అవస్థలు                           .
గుడిహత్నూర్‌ మండలంలోని తోయగూడ గ్రామ రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలకు బురదమయంగా మారడంతో నడిచేందుకు కూడా వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులపై మొరం మట్టి పోసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
    user_Sidam Sidam
    Sidam Sidam
    Ichoda, Adilabad•
    44 min ago
  • తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా
రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణం: జువ్వాడి కృష్ణారావు జగిత్యాల జిల్లా కోరుట్ల: కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించారంటూ ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి 54 శాతం నాణ్యత మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అవినీతి, ప్రజల సొమ్ము దుర్వినియోగం వంటి అంశాల్లో కల్వకుంట్ల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని సంజయ్‌కు కృష్ణారావు సూచించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, మసీద్ ముజ్బిత్, పిజర్ ఖయ్యూం, చుమ్ము హర్షత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణం: జువ్వాడి కృష్ణారావు

జగిత్యాల జిల్లా కోరుట్ల: కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించారంటూ ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి 54 శాతం నాణ్యత మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.
అవినీతి, ప్రజల సొమ్ము దుర్వినియోగం వంటి అంశాల్లో కల్వకుంట్ల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని సంజయ్‌కు కృష్ణారావు సూచించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, మసీద్ ముజ్బిత్, పిజర్ ఖయ్యూం, చుమ్ము హర్షత్ తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు.. రైతులకు తప్పని ఇబ్బందులు నర్సాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి యాప్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు.. రైతులకు తప్పని ఇబ్బందులు
నర్సాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి యాప్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    43 min ago
  • కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు
    1
    కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి ఆకస్మిక తనిఖీ*

*చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన*
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. 
చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. 
ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఆదివారం సీఐటీయూ టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్ , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*
    2
    కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి
పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి
ఆదివారం  సీఐటీయూ  టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ  , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్  , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..
    4
    *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం*

*-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే*
చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి  ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. 
ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు.
వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం  తరఫున అవసరమైన సహాయం  అందజేస్తామని తెలిపారు..
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ  ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.
రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత 
పై అవగాహన కల్పించడానికి అరైవ్ 
అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు  మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు...
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్  విజ్ఞప్తి చేశారు..
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.