logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జావేద్ కు నివాళులు అర్పించిన తుమ్మల యుగంధర్ బుధవారం జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు మహ్మద్ జావీద్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ జావీద్ నివాసానికి వెళ్లి, భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ, జావీద్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సీనియర్ నాయకులు మానుకొండ రాధాకిషోర్ , కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ , ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి , జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
8 hrs ago
bbf0244d-f586-4892-9199-b87190fb2ade

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జావేద్ కు నివాళులు అర్పించిన తుమ్మల యుగంధర్ బుధవారం జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు మహ్మద్ జావీద్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ జావీద్ నివాసానికి వెళ్లి, భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ, జావీద్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సీనియర్ నాయకులు మానుకొండ రాధాకిషోర్ , కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ , ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి , జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి
    1
    జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
మల్లు భట్టి విక్రమార్క  
ఉపముఖ్యమంత్రి
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    17 hrs ago
  • నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 day ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నిమ్మని రాజేశ్వర్ రావు మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నిమ్మని రాజేశ్వర్ రావు మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by దాసరి ప్రేమ్
    1
    Post by దాసరి ప్రేమ్
    user_దాసరి ప్రేమ్
    దాసరి ప్రేమ్
    పొన్నూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • హన్మకొండ జిల్లాలో టీజీ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. గురువారం హన్మకొండ–హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న బస్సు సాంకేతిక లోపాలతో రోడ్లపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నిట్ సమీపంలో ఓ ఈవీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి ప్రత్యామ్నాయ వాహనాలు ఆశ్రయించారు.
    1
    హన్మకొండ జిల్లాలో టీజీ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. గురువారం హన్మకొండ–హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న బస్సు సాంకేతిక లోపాలతో రోడ్లపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నిట్ సమీపంలో ఓ ఈవీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి ప్రత్యామ్నాయ వాహనాలు ఆశ్రయించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.