మండపేటలో వేడుక గా... టిడ్కో గృహాల గృహప్రవేశాలు... నేడు లబ్ధిదారులకి 1104 ఇళ్ల పంపిణీ కలెక్టర్ కీర్తి చేకూరి... 6128 గృహాల ప్రాజెక్ట్‌కు ఊపందించిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట టౌన్ న్యూస్... సోమవారం ఉదయం మండపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపుంతలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు లు మొదటగా లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించగా, అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ అర్బన్ పథకాల కింద మండపేటలోని గొల్లపుంత,కాలనీలలో మొత్తం 6128 గృహాలను గ్రౌండింగ్ చేయగా, ఇప్పటికే 5024 గృహాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. సోమవారం నూతనంగా మరో 1104 గృహాలను అందజేసినట్లు పేర్కొన్నారు. టిడ్కో కాలనీలలో డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, అదనంగా ఒక బృందాన్ని నియమించి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరుస్తామని తెలిపారు. డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ నిధులతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.ఈ లేఅవుట్ విశాలంగా ఉందని, మౌలిక వసతులతో పాటు ఉద్యానవనాలు, ఆట స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గృహ సముదాయాలలో పెండింగ్‌లో ఉన్న సుమారు 10 శాతం సెప్టిక్ ట్యాంక్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, నీటి సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. గృహాలకు సంబంధించి బ్యాంకులతో లోన్ లింక్ కాని వారు ఉంటే వెంటనే లింక్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.ఈ గృహ సముదాయంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు దిశగా కృషి చేస్తామని, ఆర్టీసీతో చర్చించి కాలనీకి సమీపంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు గృహాలలో నివాసం ఉంటున్నారని, మిగిలిన వారు కూడా త్వరగా వచ్చి నివసించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరవు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 లో టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్ Iలో భాగంగా మండపేటలో 4064 గృహాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించామని, ఇంకా మిగిలిన లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని ఫేజ్ 2లో 2212 గృహాలను సాంక్షన్ చేయించేలా కృషి చేసినట్లు తెలిపారు.న మనప్రభుత్వ హయాంలోనే 4064 గృహాల నిర్మాణాలు పూర్తి చేసి, టాయిలెట్‌లకు బయటి పైప్‌లైన్ కనెక్షన్లు మినహా మిగతా అన్ని పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తోందన్నారు. ఇప్పటికే 5024 గృహాలను లబ్ధిదారులకు అంద జేసినట్లు, సోమవారం మరో 1104 గృహాలను అప్పగించడం జరిగిందని తెలిపారు.టిడ్కో కాలనీలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే సిబ్బందంతా అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగేశ్వర రావు తెలియ చేశారు. కాలనీని మండపేట పట్టణానికి సమానంగా అభివృద్ధి చేసి, పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి స్పష్టమైన మార్పు తీసుకువస్తామని అన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటుకు తీర్మానం పంపినట్లు తెలిపారు.గతంలో కోనసీమ జిల్లాలో భాగంగా ఉన్న మండపేట నియోజకవర్గం జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం వల్ల కొంత అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో భాగమైనందున రాజమండ్రితో సమానంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. టిడ్కో గృహ సముదాయంలో గుడి, చర్చి ఏర్పాటు చేయాలనే లబ్ధిదారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని అధికారులు సర్వే చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అదేవిధంగా పార్కు, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కూడా చర్యలు చేపడతామని వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- Post by Shyam1
- Post by Syyed taher1
- దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.1
- గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- *వంగలపూడి అనిత, ఇంచార్జి మంత్రి కామెంట్స్* లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పని చేస్తున్నాం. ఈవిటీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయి. మూలపేట పోర్టు 70 శాతం కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతీ విషయంలో క్రెడిట్ చోరీ కొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాది పని చేస్తున్న ప్రభుత్వం. వాటాలు అడగని ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి. వైసీపీ వాళ్ళు వాటాలు, పార్టనర్శిప్లు అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయి. అమరావతి రాజధానిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని చెప్తున్నారు. అసలు ఇంతకీ వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా....సమాధానం చెప్పాలి. ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రాజెక్టులకు ఏ రైతు కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ. అభివృద్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారు..1
- కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు జాతీయ ప్రధాన రహదారుల సెంటర్ పోల్స్ కు అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్లెక్సీ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని,విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మూలంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేసినా సంబంధిత మున్సిపల్ మరియు పంచాయితీ సిబ్బంది చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సదరు ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులపై చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు.గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుదీప్ జిల్లా అంతటా ఫ్లెక్సీ హోర్డింగ్ లను తొలగించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు జిల్లాలోని వివిధ మండలాలలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.1