హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని వినతి అచ్చంపేట, సెప్టెంబర్ 14(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని బల్మూరు మండల కేంద్రంలో దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించే భారత రాజ్యాంగాన్ని కించపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని,శతాబ్ధాల ధర్మాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను విస్మరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేసి, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బల్మూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, బాణాల సర్పంచ్ దేశ్యా నాయక్, మైలారం మాజీ సర్పంచ్ శ్రీనులతో పాటు గణేష్, కొండల్, కొండానాగుల స్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని వినతి అచ్చంపేట, సెప్టెంబర్ 14(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని బల్మూరు మండల కేంద్రంలో దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించే భారత రాజ్యాంగాన్ని కించపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని,శతాబ్ధాల ధర్మాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను విస్మరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేసి, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బల్మూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, బాణాల సర్పంచ్ దేశ్యా నాయక్, మైలారం మాజీ సర్పంచ్ శ్రీనులతో పాటు గణేష్, కొండల్, కొండానాగుల స్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
- గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- మీడియా పై దౌర్జన్యాన్ని పరిశీలించండి ప్రతి ఒక సమస్య తెలిపేది మీడియా అలాంటి మీడియాని అనగా తొ క్కాల ని చూస్తే మీడియా మిత్రులకు పాత్రికేయులకు అని అర్థం పోతుంది విషయం ఎంత ప్రమాదం ఉన్న కవరేజ్ కి వెళ్లే వాళ్ళం ఆ విషయాలు తెలియజేసే వాళ్ళం మాపై దౌర్జన్యానికి వస్తే ఇంకెవరు తెలియజేస్తారు అందుకని మాకు రక్షణ కల్పించండి ప్రభుత్వాలని కోరేది మీడియా మిత్రులు1
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు టిప్పర్ ఢీ.. హైదరాబాద్ లోని హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.1
- సాసనూల్ గ్రామం మా వార్డు కి నీళ్లు రావట్లేదు ప్రజల మిషన్ భగీరథ మంచినీళ్ళ కష్టాలు తప్పట్లేదు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం మా లైన్ కి నీళ్లు రావట్లేదు మంచినీళ్ల కొరకు అధికారులను అడిగిన ఫలితం లేకుండా పోయింది పది రోజులు అయింది ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు పరశురాముడు బేల్లా జీవన మహేందర్ నూరు ఆవేదన వ్యక్తపరిచారు4
- నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- *సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం* *కుటుంబ సభ్యుల ఫిర్యాదు* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.3