Shuru
Apke Nagar Ki App…
#JaiDeshParty * Even amid fiscal deficits,the #Andhra State Budget 2026–27 reflects a degree of balance through its focus on employment generation,and improvement in service quality.stronger allocations required in the health and cooperative sectors. #apbudget #APAssembly
JaiDesh Party
#JaiDeshParty * Even amid fiscal deficits,the #Andhra State Budget 2026–27 reflects a degree of balance through its focus on employment generation,and improvement in service quality.stronger allocations required in the health and cooperative sectors. #apbudget #APAssembly
More news from Andhra Pradesh and nearby areas
- 🙏🙏1
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 100 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ డబుల్ రోడ్డును ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ సాదు సాంబశివరావు వెల్లడించారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలపై వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, 2018లోనే బాక్సైట్ అనుమతులు పూర్తిగా రద్దయ్యాయని వెల్లడించారు.1
- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- 🙏🙏1