క్రికెట్ బెట్టింగు నిర్వహించినా లేదా పాల్గొన్నా కఠినంగా వ్యవహరిస్తాం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ క్రికెట్ బెట్టింగు నిర్వహించినా లేదా పాల్గొన్నా కఠినంగా వ్యవహరిస్తాం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *ఆన్-లైన్ లేదా ఆఫ్-లైన్ లో క్రికెట్ బెట్టింగులు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కేసులు నమోదుచేసి, రౌడీ షీటులు తెరుస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 👉 *బెట్టింగులతో ఆర్ధికంగా నష్టపోవడం, అప్పులుపాలవడం తప్పదన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 👉 *ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే సమాచారాన్ని డయల్ 112/100 లేదా స్థానిక పోలీస్ స్టేషనుకు సమాచారం అందించాలన్న జిల్లా ఎస్పీ* క్రికెట్ బెట్టింగులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మార్చి 31న పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్-లైన్, ఆఫ్-లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, ఆర్థికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలు, యువతను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ బెట్టింగులకు పాల్పడడం వలన ఆర్ధికంగా ఎక్కువగా నష్టం కలిగిస్తాయని, సాఫీగా సాగిపోతున్న జీవితాలను నాశనం చేస్తాయన్నారు. క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమైన చర్య అని, ఇందులో పాల్గొనే వారు, నిర్వహించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బుకీలపై అనుమానాస్పద ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తూ నిరంతరం నిఘా పెట్టామన్నారు. క్రికెట్ ను ఆస్వాదించాలి తప్ప ఇటువంటి చట్ట వ్యతిరేక బెట్టింగులకు పాల్పడకూడదని జిల్లా ఎస్పీ తెలిపారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. ఒకసారి బెట్టింగులకు అలవాటు పడిన వ్యక్తులు ఆ వ్యసనం నుండి బయటకు రాలేరని, ఆలోచనలన్నీ బెట్టింగు మీదనే పెట్టి, ఆర్ధిక నష్టాలకు గురై వారి జీవితాలను నాశనం చేసుకుంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తరహా బెట్టింగులకు పాల్పడడం చట్ట విరుద్ధమని, ఎవరైనా బెట్టింగులకు పాల్పడి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా కేసుల్లో నిందితులకు జైలు శిక్షలు, పెద్ద మొత్తంలో జరిమానాలు తప్పవన్నారు. కావున, ప్రజలు, ముఖ్యంగా యువత తమ జీవితాలను నాశనం చేసే బెట్టింగు జోలికి పోవద్దన్నారు. బెట్టింగులతో డబ్బులు సంపాదించవచ్చు అనే అత్యాశతో బెట్టింగులకు పాల్పడే కంటే ఆర్థిక భద్రత కోసం కష్టపడి పని చేయడం, న్యాయబద్ధంగా సంపాదించిన నగదును సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమైన మార్గమని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఆన్-లైన్ లేదా ఆఫ్-లైన్ బెట్టింగులకు పాల్పడేవారి సమాచారాన్ని డయల్ 112/100 లేదా స్థానిక పోలీస్ స్టేషనుకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

- డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు. వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- विशाखापट्टनम में श्रद्धा वॉकर जैसा कांड: अवैध संबंधों में कत्ल, प्रेमिका की लाश को काटकर फ्रिज में छिपायाविशाखापट्टनम में एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है. विशाखापत्तनम: विशाखापट्टनम की एक दिल दहला देने वाली घटना ने फिर एक बार श्रद्धा वॉकर हत्याकांड की याद दिला दी. यहां एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है. हत्यारा रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. आरोपीका मृतक महिला से अवैध संबंध था. विशाखापट्टनम की इस रूह कंपा देने वाली घटना की डिटेल दिए देते हैं. 35 साल के रवींद्र ने शादीशुदा होने के बाद भी 29 साल की मोनिका से अवैध संबंध था. मोनिका विशाखापत्तनम की रहने वाली है तो रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. कैसे हुई घटना? पुलिस के अनुसार कुछ हफ्ते पहले रवींद्र की पत्नी अपने मायके (विजयनगरम) गई हुई थी. रवींद्र ने रविवार दोपहर को मोनिका को अपने घर बुलाया.दोनों कई घंटों तक घर पर ही थे. शाम के समय दोनों के बीच किसी बात को लेकर झगड़ा शुरू हो गया. गुस्से में आकर रवींद्र ने चाकू से गोदकर मोनिका की हत्या कर दी. हत्या करने के बाद आरोपी रवींद्र ने घर के अंदर ही मोनिका के शव के कई टुकड़े किए और शव के कुछ हिस्सों को बैग में भरकर ठिकाने लगाने के लिए एक सुनसान जगह पर फेंक दिया, जबकि बाकी हिस्सों को अपने ही घर के फ्रिज (refrigerator) में छिपाकर रख दिया.1
- ఇంటి నుండి పని రోజుకు 4-5 గంటల వని చేను ₹20,000 ₹40,0001
- గిరి గ్రామాలలో ఇటుకల పండగ ప్రస్తుతం ఘనంగా కొనసాగుతోంది. ఈ పండగను గిరిజనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పండగ ప్రారంభానికి ముందు గ్రామ పూజారి (గురుమై) ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక గుడ్డును ప్రతిష్ఠిస్తారు. అనంతరం గ్రామస్తులు రాళ్లతో ఆ గుడ్డును పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. గుడ్డును పగలగొట్టిన వ్యక్తిని ప్రత్యేకంగా సత్కరించి ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాకుండా విజేతకు నగదు బహుమతి కూడా అందజేస్తారు.1
- Post by Shyam1
- శ్రీకాకుళం జిల్లా టెక్కెర నియోజకవర్గం దడియాల పేట గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఆలయ వార్షికోత్సవ పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దశ్రద్ధలతో సామూహిక కుంకుమ అర్చనలు చేసి అమ్మవారిని మొక్కులు తీర్చ్చుకున్నారు.3
- గ్రామ సర్పంచులకు ఘన సత్కారం మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.4
- విద్యార్ధులతో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేయడం ద్వారా తన నిరాడంబరతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాటుకున్నారు. వారితో మమేకమై ఉత్సాహాన్ని నింపారు.జామి మండలం లొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై, వారి చదువుల పురోగతి గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారానే జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించగలరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి, స్వయంగా విద్యార్థులకు వడ్డన చేశారు. తన హోదాను పక్కనపెట్టి, సామాన్యుడిలా విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భోజనం తర్వాత కాసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థులతో ఇంత నిరాడంబరంగా గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.1