logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తాటి ములకలపల్లి: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి వేడుకల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న పీవీఆర్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పామర్తి వెంకటేశ్వరరావు, శంకర్, దేవినాథ్, పామర్తి గోపి, మహమ్మద్ ముత్లిఫ్, ఖాదర్, ప్రశాంత్, అజయ్, యాసిన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

13 hrs ago
user_Velpula Manoj Kumar
Velpula Manoj Kumar
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
13 hrs ago
012ce8f4-b0b7-418f-b960-39c666b70ebe
db713e76-22bf-4b81-852e-800036603004

గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తాటి ములకలపల్లి: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి వేడుకల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న పీవీఆర్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పామర్తి వెంకటేశ్వరరావు, శంకర్, దేవినాథ్, పామర్తి గోపి, మహమ్మద్ ముత్లిఫ్, ఖాదర్, ప్రశాంత్, అజయ్, యాసిన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
    1
    ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!!
గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి  రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్‌ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు
    1
    భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ
భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్‌ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
    1
    సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి

సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, 

సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం.

అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో 

తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.
నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు

ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    1
    పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు..................

రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన
ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం
అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ
పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు
దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    1
    ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ

ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ
*మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ**
మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు 
మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు.
మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు.
1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 hrs ago
  • మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.
    1
    మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్
పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం
సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్
పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం
సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి.
పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.
డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు.
సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం
మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.
“పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.
    user_Hatkar Rambabu
    Hatkar Rambabu
    Farmer సింగరేణి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    1
    ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు
*ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
*స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు.
*కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది.
*ప్రత్యేక ప్రేరణ:*
ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు.
ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్‌లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    1
    హైదరాబాద్‌లో దారునా హత్యా  సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో  గోదావ
*లైవ్ మర్డర్ వీడియో..!* 
హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి
హత్యతో నగరంలో భయాందోళనలు
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య
ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య
నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్
హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య
ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు
బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్
సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు
ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు
నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    user_Prabhakarrao s
    Prabhakarrao s
    Insurance Agent బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.