logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాత్రలతో నులిపురుగుల నివారణ అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్‌వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. సౌమ్య గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 1–19 ఏళ్ల విద్యార్థినిలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. నులిపురుగుల నివారణకు పరిశుభ్రత, చెప్పులు ధరించడం, చేతులు కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అలవాట్లు తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
3 hrs ago
44e5b908-cb90-4615-a65a-0415709e6638

మాత్రలతో నులిపురుగుల నివారణ అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్‌వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. సౌమ్య గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 1–19 ఏళ్ల విద్యార్థినిలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. నులిపురుగుల నివారణకు పరిశుభ్రత, చెప్పులు ధరించడం, చేతులు కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అలవాట్లు తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    1
    జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    19 hrs ago
  • కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    1
    కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    4
    దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర  స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో   మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 
*నేడు త్రిశూల స్నానం*
మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా  పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    3 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    19 hrs ago
  • చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    1
    చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత
ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయతీ కేంద్రంలో సోమవారం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. సర్పంచి కాసులమ్మ, వైస్ ఎంపీపీ రాజు బాబు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయతీ కేంద్రంలో సోమవారం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. సర్పంచి కాసులమ్మ, వైస్ ఎంపీపీ రాజు బాబు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.