దుబాయ్‌లో మరణించిన జనసైనికుడి కుటుంబానికి అండగా నాగబాబు... - స్వగ్రామానికి భౌతికకాయం రప్పించేందుకు చర్యలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కోరకంటి నాగబాబు దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం సుదూర ప్రాంతం వెళ్లి, అక్కడే తనువు చాలించిన నాగబాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆయన తల్లి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేనాని పవన్ కళ్యాణ్ ని వేడుకున్నారు. ఈ విషాద ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులకు అండగా నిలవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వారి సూచనల మేరకు జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, దొమాదల కిషోర్ చేబ్రోలులోని నాగబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు జనసేన నాయకత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. జనసేన నాయకుడు త్రిమూర్తులు మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించి ధైర్యం చెప్పారని, మృతుడికి కంపెనీ నుంచి అందాల్సిన జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల గురించి అక్కడి ప్రతినిధులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని త్రిమూర్తులును కోరడం జరిగిందని అన్నారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా పిఠాపురం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు,రవాణా ఏర్పాట్లను జనసేన పార్టీ దగ్గరుండి పర్యవేక్షిస్తోందని, కష్టకాలంలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి జనసేన నాయకత్వం ముందుకు రావడంపై మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నాగబాబు కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని నల్లం శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
దుబాయ్‌లో మరణించిన జనసైనికుడి కుటుంబానికి అండగా నాగబాబు... - స్వగ్రామానికి భౌతికకాయం రప్పించేందుకు చర్యలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కోరకంటి నాగబాబు దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం సుదూర ప్రాంతం వెళ్లి, అక్కడే తనువు చాలించిన నాగబాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆయన తల్లి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేనాని పవన్ కళ్యాణ్ ని వేడుకున్నారు. ఈ విషాద ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులకు అండగా నిలవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వారి సూచనల మేరకు జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, దొమాదల కిషోర్ చేబ్రోలులోని నాగబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు జనసేన నాయకత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. జనసేన నాయకుడు త్రిమూర్తులు మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించి ధైర్యం చెప్పారని, మృతుడికి కంపెనీ నుంచి అందాల్సిన జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల గురించి అక్కడి ప్రతినిధులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని త్రిమూర్తులును కోరడం జరిగిందని అన్నారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా పిఠాపురం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు,రవాణా ఏర్పాట్లను జనసేన పార్టీ దగ్గరుండి పర్యవేక్షిస్తోందని, కష్టకాలంలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి జనసేన నాయకత్వం ముందుకు రావడంపై మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నాగబాబు కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని నల్లం శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- 🙏😭1
- పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘర్షణ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం1
- Post by Sageni gangadhar1
- Post by Rai Narendra1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 🙏😭1